శివాజీనగర: స్నేహితురాలిని లైంగికంగా వేధిస్తున్నాడనని ఆమె మిత్రుడు రుణదాతను హత్య చేశాడు. బెళగావి జిల్లా అథని తాలూకాలోని బల్లిగేరిలో ఈ సంఘటన జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. శ్రీదేవి రాజపుత్ అనే మహిళను రణవీర్ రాజ్‌పుత్ లైంగిక వేధించేవాడు. అతడు ఆమెకు కొంత డబ్బు అప్పు ఇచ్చాడు. ఆ కారణంతో సతాయించసాగాడు. సెప్టెంబర్ 21న రాత్రి బైక్ స్టార్ట్ కావడం లేదని చెప్పి రణవీర్‌ను బైరు పవార్ అనే వ్యక్తి పిలిపించుకొన్నాడు. ఆ తరువాత గొంతుకు తాడు బిగించి హత్య చేశాడని పోలీసులు తెలిపారు. హత్య తరువాత బైరు, శ్రీదేవికి ఫోన్ చేసి చెప్పాడు. విచారణ చేపట్టిన అథణి పోలీసులు కాల్ డేటా ఆధారంగా ఇద్దరినీ అరెస్ట్ చేశారు.
లారీని క్యాబ్ ఢీ, ఉద్యోగి మృతి
యశవంతపుర: చెడిపోయి రోడ్డుపై నిలిచిన లారీని టొయోటా క్యాబ్ ఢీకొన్న ప్రమాదంలో కంపెనీ ఉద్యోగి చనిపోయాడు. బెంగళూరు కుంబళగోడు సమీపంలోని బెంగళూరు–మైసూరు హైవేలో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. తిలక్ నగరకు చెందిన ముబారక్ (35) అనే ప్రైవేటు ఉద్యోగి క్యాబ్‌లో కంపెనీకి వెళ్తుండగా క్యాబ్ నిలిచి ఉన్న లారీని ఢీకొనింది. ముందు సీటులో కూర్చున్న ముబారక్ తీవ్రగాయాలతో చనిపోగా, డ్రైవర్‌తో పాటు కంపెనీకి చెందిన 11 మంది గాయపడ్డారు. కెంగేరి పోలీసులు కేసు నమోదు చేశారు.
రూ.24 లక్షల డ్రగ్స్ పట్టివేత
బనశంకరి: మంగళూరులో ఎండీఎంఏ క్రిస్టల్ అనే మత్తు పదార్థం విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ.24 లక్షల విలువచేసే 240 గ్రాముల ఎండీఎంఏని స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరులో కొనుగోలు చేసి మంగళూరులో ప్రజలు, విద్యార్థులకు అమ్ముతున్నట్లు తెలిసి దాడి చేశారు. ఉళ్లాలవాసులైన నవాజ్, మహమ్మద్ అరిఫ్, లాయిడ్ డిసోజాలు పట్టుబడ్డారు. వీరిపై ఇదివరకే డ్రగ్స్, ఇతరత్రా నేరాల కేసులు ఉన్నాయి.
బెళగావిలో వీడిన మిస్టరీ
నిందితుడు, మహిళ అరెస్టు


