కన్నడనాట కరువెలా ఉంది? | - | Sakshi
Sakshi News home page

కన్నడనాట కరువెలా ఉంది?

Sep 28 2026 1:29 AM | Updated on Sep 28 2026 1:29 AM

శివాజీనగర: రాష్ట్రంలో కరువు తాండవిస్తోంది. వర్షాలు లేక పంటలు ఎండిపోయాయి, నదులు, డ్యాముల్లో నీటిమట్టం అంతంతమాత్రంగా ఉంది, భూగర్భ జలాలు కూడా పడిపోయి అన్నదాతలు అవస్థల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో వాస్తవ పరిస్థితిని అంచనా వేయడానికి కేంద్ర ప్రభుత్వ అధ్యయన బృందం అక్టోబర్‌ మొదటి వారంలో కర్ణాటకలో పర్యటించనుంది. కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి అజిత్‌కుమార్‌ సాహు నేతృత్వంలోని అధికారులు వివిధ జిల్లాల్లో కరువు పరిశీలన ఆసగిస్తారు. సీఎం డీ.కే.శివకుమార్‌తో పర్యటనకు ముందు, తరువాత సమావేశమవుతారు. కరువు తాలూకాల జాబితాను, నష్ట వివరాలను ప్రభుత్వం కేంద్ర బృందానికి అందిస్తుంది. ఎంపిక చేసిన తాలూకాలను సందర్శిస్తారు. ఈ బృందం సమర్పించిన నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం కరువు సహాయక నిధులను విడుదల చేస్తుంది.

177 తాలూకాల్లో దుర్భిక్షం

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 177 తాలూకాలను కరువు ప్రభావిత తాలూకాల జాబితాలో చేర్చింది. ఈ నెలాఖరులో మరిన్ని తాలూకాలు చేరే అవకాశం ఉంది. దీంతో మొత్తం 220 తాలూకాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం రూ.23,705 కోట్ల సహాయాన్ని కోరింది.

అక్టోబరులో కేంద్ర బృందం రాక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement