మేల్కోకుంటే.. మధుమేహం, స్థూలకాయం | - | Sakshi
Sakshi News home page

మేల్కోకుంటే.. మధుమేహం, స్థూలకాయం

Sep 28 2026 1:29 AM | Updated on Sep 28 2026 1:29 AM

మండ్య: ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం, 2035 నాటికి 400 కోట్ల మంది ఊబకాయంతో బాధపడతారు, మధుమేహవ్యాధిగ్రస్తుల సంఖ్య 100 కోట్ల కంటే పెరుగుతోందని, ఈ రెండు సమస్యలు చాలా వేగంగా విస్తరిస్తున్నాయని ఇంటర్నేషనల్‌ అలయన్స్‌ మల్టిపుల్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ కె.టి.హనుమంత్‌ అన్నారు. మండ్య నగరంలోని ప్రైవేటు ఆస్పత్రిలో షుగర్‌, స్థూలకాయం స్క్రీనింగ్‌ ప్రచార కార్యక్రమం ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. మారుతున్న జీవనశైలి కారణంగా ప్రపంచవ్యాప్తంగా మధుమేహం, ఊబకాయం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని హెచ్చరించారు. నేడు ప్రపంచంలో 73 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతుండగా, 136 కోట్ల మంది ఊబకాయ సమస్యలతో సతమతమవుతున్నారని చెప్పారు. అనారోగ్యకరమైన సమాజం ఏర్పడటానికి మనిషే కారణమని అన్నారు.

ఆ ఆహారంతో అనారోగ్యం

మధుమేహ నిపుణురాలు డాక్టర్‌ బి.శృతి మాట్లాడుతూ, మన పూర్వీకుల ఆహారపు అలవాట్లను పాటించని ప్రజలలో అనేక వ్యాధులు పెరుగుతున్నాయన్నారు. మానసిక ఒత్తిడి కారణంగా అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయన్నారు. చిన్నపిల్లలకు చక్కెర మిఠాయిలు, బేకరీ ఉత్పత్తులు, పిండి పదార్థాలు, జంక్‌ ఫుడ్‌ ఇవ్వడం వల్ల కూడా మధుమేహం తలెత్తుతోందన్నారు. వ్యాయామం లేని జీవనశైలి మధుమేహం, ఊబకాయం వ్యాప్తిని మరింత తీవ్రతరం చేస్తోందని ఆమె హెచ్చరించారు. ఈ సందర్భంగా వైద్యనిపుణులు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈవో సుహాస్‌, కె.ఆర్‌.శశిధర ఈచగెరె, చంద్రశేఖర్‌, ధనంజయ్‌ ధరసాగుప్పె పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల ప్రముఖులను సన్మానించారు.

మంచి అలవాట్లను పాటించాలి

వైద్య నిపుణుల హెచ్చరిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement