సీఈసీ.. ప్రజాస్వామ్యానికి మసిపూసి | - | Sakshi
Sakshi News home page

సీఈసీ.. ప్రజాస్వామ్యానికి మసిపూసి

Sep 27 2026 1:46 AM | Updated on Sep 27 2026 1:46 AM

శివాజీనగర: కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ జ్ఞానేష్‌కుమార్‌ను పదవి నుంచి తొలగించాలి, ఆయనను అరెస్టు చేయాలి అని ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ డిమాండ్‌ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘానికి, సర్‌ ప్రక్రియకు వ్యతిరేకంగా శనివారం బెంగళూరు స్వతంత్ర పార్కులో సీఎం డీకే, మాజీ సీఎం సిద్దరామయ్య, మంత్రులు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలతో బృహత్‌ నిరసన సభను నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం డీకే శివకుమార్‌ ప్రసంగిస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి మేము ముందుకు వచ్చామని చెప్పారు. సీఈసీ జ్ఞానేష్‌కుమార్‌పై ఆరోపణలు వచ్చినందున, రాష్ట్రపతి తక్షణం ఆయనను తొలగించాలని డిమాండ్‌ చేశారు. అధికార దాహం మితిమీరకూడదు, సూర్యోదయం తరువాత సూర్యాస్తమయం అవుతుందని, ఇది ప్రధాని, కేంద్ర మంత్రులు గ్రహించాలని సీఎం అన్నారు.

ప్రజాస్వామ్యవాదుల్లో ఆందోళన: సిద్దు

సీఈసీ జ్ఞానేష్‌కుమార్‌ను తొలగించాలని సిద్దరామయ్య డిమాండ్‌ చేశారు. ఎన్నికల సంఘంలో పరిణామాలపై ప్రజాస్వామ్యవాదులు ఆందోళన చెందుతున్నారన్నారు. ప్రతి ఐదేళ్లకు ఓసారి ఎన్నికలు స్వతంత్రంగా జరగకపోతే, ఇది ప్రజాస్వామ్య మనుగడకు సంబంధించి ప్రశ్న అని అన్నారు. ఎన్నికల సంఘం కమిషనర్లు రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించకూడదు, ఒకవేళ అలా చేస్తే, రాష్ట్రపతి వారిని పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. గత కొన్నేళ్లుగా ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వానికి కీలుబొమ్మలా మారారు. జ్ఞానేష్‌కుమార్‌ నియంతలా వ్యవహరిస్తున్నారని మరో ఇద్దరు కమిషనర్లు అభ్యంతరాలు లేవనెత్తారు. ఈ పరిణామాలకు ప్రధాని మోదీ, అమిత్‌ షాలే బాధ్యులని సిద్దరామయ్య విమర్శించారు. దేశంలో జెన్‌ జీ మోదీకి వ్యతిరేకంగా ఉన్నారు. అందుకే ఆ ఓటర్లను దూరం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కేపీసీసీ అధ్యక్షుడు బీ.కే.హరిప్రసాద్‌ ఆరోపించారు. దేశంలో మోదీ ప్రభావం లేదని అన్నారు. దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉంటుందని, ఆ హక్కును దొంగిలించే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. ఈ సభలో వేలాదిగా కార్యకర్తలు పాల్గొన్నారు.

జ్ఞానేష్‌కుమార్‌ను తొలగించి,

అరెస్టు చేయాలి

సీఎం డీకే శివకుమార్‌ డిమాండ్‌

బెంగళూరు స్వతంత్రపార్కులో

బృహత్‌ నిరసన సభ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement