బడుగు వర్గాలకు అన్యాయం సర్‌ | - | Sakshi
Sakshi News home page

బడుగు వర్గాలకు అన్యాయం సర్‌

Sep 27 2026 1:40 AM | Updated on Sep 27 2026 1:40 AM

గౌరిబిదనూరు: కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్‌ఐఆర్‌ను కర్ణాటక ప్రజలు అంగీకరించరని, దీనిని వెంటనే నిలిపివేయాలని బహుభాషా నటుడు ప్రకాశ్‌రాజ్‌ డిమాండ్‌చేశారు. శనివారం ఇక్కడ హీరేబిదనూరు రామలింగేశ్వర దేవాలయం ఆవరణలో పౌర ఓటర్ల హితరక్షణ సమితి ఆధ్వర్యంలో ‘నో సర్‌’ జాగృతి సమావేశంలో ప్రకాశ్‌రాజ్‌ పాల్గొని ప్రసంగించారు. సర్‌ వల్ల అల్పసంఖ్యాకులు, మహిళలు, నిరక్ష్యరాస్యులు, వలస కార్మికులు ఓటు హక్కును కోల్పోయే ప్రమాదముందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రాజకీయ లాభానికి ఈ ప్రక్రియను అమలు చేస్తూ ఉందన్నారు. ప్రజా ప్రభుత్వంలో ఓటరే ప్రధానభూమిక కాబట్టి అర్హతకల ఓటరుకు నష్టం జరగకూడదు అన్నారు. కార్యక్రమంలో సోమయ్య, రఫిక్‌, వైటి ప్రసన్న, ప్రజలు పాల్గొన్నారు.

అదృశ్యమై.. 8 రోజుల

తరువాత శవమై

● నవ వివాహిత విషాదాంతం

యశవంతపుర: హాసన్‌ జిల్లా చన్నరాయపట్టణ తాలూకా చిక్కనాయకనహళ్లికి చెందిన నవ వివాహిత ప్రియాంక (27) అదృశ్యం కేసు విషాదాంతమైంది. 8 రోజుల తరువాత ఆమె మృతదేహం శ్రావణ బెళగొళ దగ్గర హేమావతి కాలువలో తేలింది. వివరాలు.. ఈ నెల 19న రాత్రి సన్నరాయపట్టణ తాలూకా చిక్కనాయకనహళ్లిలో భార్యాభర్తలు రాజశేఖర్‌, ప్రియాంక ఊరి శివార్లలోని కాలువ దగ్గరకెళ్లారు. అక్కడ గొడవ జరిగిందని, ఆమే కాలువలోకి దూకేసిందని భర్త చెబుతున్నాడు. అయితే భర్తే ప్రియాంకను నీటిలోకి తోసేసినట్లు ప్రియాంక కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఆమెకు ఈత వస్తుందని చెప్పారు. అప్పటి నుంచి పోలీసులు, ఫైర్‌ సిబ్బంది గాలింపు చేపట్టారు. కాలువలో వెతుకుతూ వెళ్లగా లోతుగా ఉన్నచోట మృతదేహం లభించింది. శ్రావణ బెళగొళ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రియాంకకు మొదటే పెళ్లయిందని, అది దాచి తనతో రెండవ పెళ్లి చేశారనే కోపంతో రాజశేఖర్‌ ఆమెను హత్య చేశాడని మృతురాలి కుటుంబీకులు ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement