బోనులోకి హంతక పులి | - | Sakshi
Sakshi News home page

బోనులోకి హంతక పులి

Sep 27 2026 1:46 AM | Updated on Sep 27 2026 1:46 AM

పట్టాదారులం

మైసూరు: చామరాజనగర తాలూకా బడగలపురలో బసవణ్ణ అనే రైతును ఇటీవల చంపి తిన్న పులిని తావరెకెట్టె మోళే గ్రామం వద్ద పట్టుకున్నారు. అటవీ సిబ్బంది శనివారం ఉదయం పెంపుడు ఏనుగులు కంజన్‌, ఈశ్వర్‌ల సహాయంతో గాలింపు జరుపుతుండగా పులి ఎదురుపడింది. దీంతో తుపాకీతో మత్తుమందు కొట్టి పులిని బంధించారు. ఇది ఆరేడేళ్ల మగ పులిగా గుర్తించారు. 14న సాయంత్రం చెరకు పొలంలో ఉండగా పులి దాడిచేసి రైతు బసవణ్ణను పొట్టనబెట్టుకుంది. ఆ తర్వాత అటవీ సిబ్బంది డ్రోన్‌, థర్మల్‌ డ్రోన్‌లు, కుక్కలతో వెతుకులాటకు శ్రీకారం చుట్టారు. అడవిలోని శిబిరం నుంచి కుంకీ ఏనుగులను తెప్పించి అన్వేషణ సాగించారు. గత 12 రోజులుగా 65కు పైగా సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. పులిని మైసూరు జూపార్క్‌కి తరలించారు.

చిరుత బందీ

మైసూరు: మైసూరు జిల్లా హెచ్‌డీకోటె తాలూకా తుంబసోగె గ్రామంలో పొలంలోని బోనులో చిరుత చిక్కింది. కొన్నిరోజులుగా గ్రామ రైతులు, పశువులు, మేకలు ఇతర మూగజీవాలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన మూడేళ్ల వయస్సుగల మగ చిరుతగా గుర్తించారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు అటవీ అధికారులు కొన్నిచోట్ల మేక పిల్లలను ఎరగా ఉంచి బోనులు పెట్టారు. శుక్రవారం రాత్రి ఓ బోనులోకి పడింది. దానిని దూరంగా తరలించడంతో గ్రామస్తులు హమ్మయ్యా అని నిట్టూర్చారు.

ఇటీవల చామరాజనగర

తాలూకాలో రైతు బలి

పట్టుకున్న అటవీ సిబ్బంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement