రాయచూరు రూరల్: నగరంలో ప్రత్యేకంగా ఐదో రోజు గణపతులను నిమజ్జనం చేశారు. శుక్రవారం రాత్రి ఐదో రోజు వినాయకుల నిమజ్జనాలను భక్తిశ్రద్ధలతో చేశారు. శనివారం తెల్లవారు జామున జరిగిన ర్యాలీలో ఇద్దరు బాలురు ప్రాణాలను కోల్పోయారు. వీర సావర్కర్ వినాయకుడిని కాస్‌బావిలో నిమజ్జనం చేశారు. పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. నగరంలోని జహీరాబాద్ వద్ద ట్రాక్టర్‌లో వినాయకుడిని తీసుకెళుతున్న సమయంలో అనుకోకుండా ట్రాక్టర్ టైర్ల కింద పడి ఇద్దరు బాలురు మరణించారు. మృతులను సుచిత్ కుమార్(16), చరణ్ కుమార్ (14)లుగా పోలీసులు గుర్తించారు. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఉమేష్ కాంబ్లే తెలిపారు.
డీజే శబ్ధంతో బాలికకు అస్వస్థత
పోలీసులు డీజే శబ్దంతో ఊరేగింపును త్వరిత గతిన పూర్తి చేయాలని ఆదేశించినా గణపతి ట్రస్ట్ నిర్వాహకులు రాత్రి 7 గంటల నుంచి తెల్లవారు జాము వరకు మోగించడంతో అర్థ రాత్రి గోల్ మార్కెట్ నివాసి జైభీమ్ వల్లభ అనే చిన్నారి బాలిక ఆ శబ్ధానికి అస్వస్థతకు గురైందని జిల్లాధికారికి ఫిర్యాదు చేయడానికి వెళితే పోలీసులు కేసు స్వీకరణకు నిరాకరించారు. ఈ విషయంపై వీడియోలు వైరలయ్యాయి.
ఇద్దరు బాలుర దుర్మరణం


