రిహాబిలిటేషన్‌లలో హింసోన్మాదం | - | Sakshi
Sakshi News home page

రిహాబిలిటేషన్‌లలో హింసోన్మాదం

Sep 21 2026 6:41 AM | Updated on Sep 21 2026 6:41 AM

మైసూరు: తండ్రీ కొడుకులు మద్యానికి బానిసలు కావడంతో కుటుంబీకులు పునరావాస కేంద్రంలో చేర్పిస్తే ఒకరి ప్రాణమే పోయింది. మైసూరులోని అలనహళ్లి బెస్ట్‌ ఫ్యూచర్‌ ఫౌండేషన్‌ మద్య పునరావాస కేంద్రం యజమాని లోకేష్‌ను హత్య కేసులో అలనహళ్లి పోలీసులు అరెస్టు చేశారు. పునరావాస కేంద్రంలో ఉండే మనోజ్‌ రావు అనే యువకుడు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించాడు.

సీసీ ఫుటేజీలో తేలిన నిజం

వివరాలు.. గాయత్రీపురానికి చెందిన మనోజ్‌రావు (28), అతని తండ్రి రాజేంద్రరావులను ఆగస్టు 13న బెస్ట్‌ ఫ్యూచర్‌ ఫౌండేషన్‌ పునరావాస కేంద్రంలో చేర్పించారు. రక్తపోటు తగ్గిందని మనోజ్‌ను నిర్వాహకులు హడావుడిగా ఆసుపత్రిలో చేర్పించారు. అయితే, సెప్టెంబర్‌ 17 రాత్రి ఆసుపత్రిలో చనిపోయాడు. ఈ ఘటన తర్వాత, తల్లి, బంధువులు ఆ కేంద్రానికి వెళ్లి అక్కడి సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. అక్కడి సిబ్బంది మనోజ్‌ను ఏదో కారణంతో కొట్టి హింసిస్తున్న దృశ్యాలు లభ్యం కావడంతో అక్కడే ధర్నా చేశారు. రాజేంద్ర రావు కళ్లెదుటే కుమారుడు మనోజ్‌ చేతులు, కాళ్లు కట్టేసి, నోట్లో గుడ్డ కుక్కి, మెడకు గుడ్డ కట్టి హింసిస్తున్నట్లు ఉంది. అప్పటినుంచి యజమాని లోకేష్‌ పరారీలో ఉన్నాడు. మృతుని బంధువు శివాజీరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, లోకేష్‌ను అరెస్టు చేశారు. కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న 20 మందిని వారి కుటుంబాలకు అప్పగించి సీజ్‌ చేశారు.

రిహాబ్‌ల పేర్లతో దందా

కాగా బెంగళూరుతో సహా అనేక నగరాల్లో డ్రగ్స్‌, మద్యం వంటి దురలవాట్లను మాన్పించే పేరుతో అనేక ప్రైవేటు పునరావాస కేంద్రాలు (రిహాబ్‌లు) వెలిశాయి. వీటిలో భారీ మొత్తాల్లో ఫీజులను వసూలు చేస్తుంటారు. సిబ్బంది హింసాత్మకంగా ప్రవర్తిస్తుంటారని ఆరోపణలున్నాయి. వీటిపై ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడంతో ఆడింది ఆటగా సాగుతోంది.

మద్య వ్యసనపరున్ని కొట్టిచంపిన సిబ్బంది

మైసూరులో కిరాతకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement