బొమ్మనహళ్లి: ఒంటరిగా నడుస్తున్న మహిళలను ఏమార్చి క్షణంలో బంగారు గొలుసు లాక్కొని పారిపోతున్న కిలాడీ పోలీసులకు చిక్కాడు. అతని వివరాలు తెలిసి వారే నోరెళ్లబెట్టారు. బుద్ధిగా ఉద్యోగం చేసుకోవాల్సిన పోస్టుమాస్టర్ సరదాగా ప్రారంభించిన చైన్ స్నాచింగ్ వ్యసనంగా మారినట్లు వివరించాడు.
థార్ జీపులో తిరుగుతూ
బెంగళూరు నగర జిల్లా పరిధిలోని ఆనేకల్ తాలూకాలోని గెరటిగనబెళే నివాసి జీవన్‌కుమార్ సిడి హొసకోట పోస్టాఫీసులో పోస్ట్‌మాస్టర్‌గా పనిచేస్తున్నాడు. కానీ మహిళల గొలుసులపై కన్నేశాడు. మహీంద్రా థార్ కారులో తిరుగుతూ ఒంటరిగా వెళ్లే మహిళలను చిరునామాలు అడిగేవాడు. తన బంధువులతో మాట్లాడాలంటూ తన మొబైల్‌ఫోన్ ఇస్తున్నట్లు హడావుడి చేసేవాడు, ఇంతలో వారి మెడలోని బంగారు గొలుసును లాక్కొని కారులో పారిపోయేవాడు. ఆనేకల్‌తో పాటు పొరుగునే తమిళనాడులోని తళి, హోసూరు, మత్తిగిరి ప్రాంతాల్లో జీవన్‌కుమార్ వరుసగా స్నాచింగ్‌లకు పాల్పడినట్లు చెబుతున్నారు. రెండు రోజుల్లోనే నలుగురు మహిళల గొలుసులు లాక్కెళ్లాడు. తళి పోలీసులు ఆనేకల్ పోలీసులతో కలిసి గాలించి పట్టుకున్నారు. అతని నుంచి థార్ జీపును, రూ. 10 లక్షల విలువైన బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. కొట్టేసిన బంగారును అమ్మి జల్సాలు చేసేవాడు.
జల్సాల కోసం పక్కదారి
బెంగళూరుతో హోసూరు
ప్రాంతంలోనూ చేతివాటం


