ఎస్పీ ఆఫీసులోనే.. డ్రిల్‌మాస్టర్‌ ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ఎస్పీ ఆఫీసులోనే.. డ్రిల్‌మాస్టర్‌ ఆత్మహత్య

Sep 21 2026 6:41 AM | Updated on Sep 21 2026 6:41 AM

పోక్సో కేసు పెట్టారని అకృత్యం

దొడ్డబళ్లాపురం: బెంగళూరు దక్షిణ జిల్లా ఎస్పీ కార్యాలయం కట్టడం 3వ అంతస్తు పై నుంచి దూకి పోక్సో కేసు నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. విజయనగరకు చెందిన శశిధర్‌ (49) మృతుడు. వివరాలు.. శశిధర్‌ చెన్నపట్టణ తాలూకాలోని ఎయిడెడ్‌ పాఠశాలలో 15 ఏళ్లుగా డ్రిల్‌ టీచర్‌గా పనిచేస్తున్నాడు. అయితే విద్యార్థినులను లైంగికంగా వేధించాడని ఫిర్యాదులు రావడంతో పోలీసులు శుక్రవారం అతనిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆదివారంనాడు వైద్య పరీక్షలు చేయించిన మహిళా పోలీస్‌స్టేషన్‌ పోలీసులు వేలిముద్రలు తీసుకునేందుకు రామనగర ఎస్పీ కార్యాలయానికి తీసుకువచ్చారు. ఆ సమయంలో 3వ అంతస్తు నుంచి దూకాడు. తీవ్రంగా గాయపడ్డ అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించగా మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు పోలీసులతో గొడవకు దిగారు. పాఠశాల ప్రిన్సిపాల్‌ కావాలనే కేసులు పెట్టించడం వల్ల ఆత్మహత్య చేసుకున్నాడని విలపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement