మండ్య: ఓ మహిళ పని మీద ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లగా అక్కడి ఉద్యోగి మాయమాటలు చెప్పి, బెదిరించి ఆమెను అన్ని విధాలా దోచుకున్నాడు. జ్యూస్‌లో మత్తు మందులు ఇచ్చి అత్యాచారం చేసి, ఆ తర్వాత వీడియో తీసి బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని బాధితురాలు ఫిర్యాదు చేయగా జిల్లాలో నాగమంగళ తాలూకాలో ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. గొండెనహళ్లి సర్కిల్‌లో గ్రామ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న మరిస్వామికి పొరుగు గ్రామానికి చెందిన మహిళ భూ సమస్యపై ఫిర్యాదుచేసింది. మాట్లాడడానికి తన ఇంటికి రావాలని అతను ఆమెను పిలిచాడు. పండ్లరసంలో మత్తుమందు కలిపివ్వడంతో మత్తులోకి జారుకుంది, ఆమైపె అఘాయిత్యం చేయడంతో పాటు వీడియో తీసి బ్లాక్‌మెయిల్ చేసేవాడని బాధితురాలు తెలిపింది. సెప్టెంబర్ 16న ఆరణి పంచాయతీలో ఎస్‌ఐఆర్ దరఖాస్తు కోసం వెళ్లగా అతను నా మెడలోని 40 గ్రాముల బంగారు గొలుసును, స్కూటర్‌ను లాక్కున్నాడని తెలిపింది. మరుసటి రోజున మరిస్వామి, మంజుల అనే మహిళ కలిసి తన భర్తను కొట్టి, చంపేస్తామని పదేపదే వేధిస్తున్నారని ఆరోపించింది. నిందితున్ని అరెస్టు చేసి కటకటాల్లోకి పంపారు.
కడుపులోనే కవలల ఛిద్రం
యశవంతపుర: కడుపు పండిన మహిళ పుట్టబోయే కవల పిల్లలను గుర్తుచేసుకుని మాతృత్వపు మధుర భావనల్లో తేలియాడేది. కానీ కిరాతక భర్త ఆమె కలలను చిదిమేశాడు. భర్త దాడిలో ఆమె కడుపులోని ఇద్దరు గర్భస్థ శిశువులు కన్నుమూశారు. ఈ దుర్ఘటన బెంగళూరులో కొత్తనూరు శబరినగరలో జరిగింది. తానియా, జాఫర్ దంపతుల మధ్య చిన్న గొడవ జరిగింది. కోపం పట్టలేని భర్త ఆరు నెలల గర్భంతో ఉన్న భార్యను కడుపుపై తన్నాడు. ఆ తాకిడికి కడుపులో పెరుగుతున్న కవలలు మృత్యువాత పడ్డారు. తీవ్ర కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరగా వైద్యులు అబార్షన్ చేయడంతో ఆమె తల్లడిల్లిపోయింది. ఈ ఘటనలపై తానియా, జాఫర్ కుటుంబాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పనిమీద వచ్చిన మహిళపై అఘాయిత్యం
వీడియోలు తీసి వేధింపులు
మండ్య జిల్లాలో విలేజ్ అకౌంటెంటు అరెస్టు


