మైసూరుకు కొత్త సొగసులు | - | Sakshi
Sakshi News home page

మైసూరుకు కొత్త సొగసులు

Sep 22 2026 1:36 AM | Updated on Sep 22 2026 1:36 AM

ప్యాలెస్‌ ముందు పూల మొక్కల కనువిందు

దసరా సంబరాల్లో మనోరంజన ప్రదర్శనలు (ఫైల్‌)

మైసూరు: ప్రతిష్టాత్మక మైసూరు దసరా సంబరాలకు నగరం ముస్తాబవుతోంది. చారిత్రక కట్టడాలు, కూడళ్లలో సుందరీకరణ పనులు చకచకా సాగుతున్నాయి. ప్యాలెస్‌ పరిసరాల్లో పూల మొక్కల అమరిక సాగుతోంది.

గోల్డ్‌ కార్డు టికెట్‌తో ఈ సౌలభ్యాలు

మరోవైపు దసరా సందర్శకులకు సోమవారం నుంచి దసరా గోల్డ్‌ కార్డులు, సంగీత కచేరీలు, నృత్య వేడుకలు సహా వివిధ కార్యక్రమాల టికెట్ల అమ్మకాలను అధికారులు ప్రారంభించారు. ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేయవచ్చు. దసరా గోల్డ్‌ కార్డు ధరను రూ.6,500గా నిర్ణయించారు. ఈ గోల్డ్‌ కార్డు ఉన్నవారు అన్ని కార్యక్రమాలకు మళ్లీ టికెట్‌ లేకుండా హాజరు కావచ్చు. మైసూరు ప్యాలెస్‌, జూ, చాముండి కొండలను ఒక్కసారి ఉచితంగా సందర్శించవచ్చు.

ఇతర టికెట్ల వివరాలు

ఇతర టికెట్ల విషయానికి వస్తే దసరా రోజున జంబూసవారీ ఏనుగుల ఊరేగింపును చూడడానికి టికెట్‌ ధర రూ.3,500. పంజీనా పరేడ్‌ను చూడాలంటే రూ.1,500 టికెట్‌ కొనాలి. డ్రోన్‌ షోను వీక్షించాలంటే రూ.1,000 టికెట్‌ ఉండాలి. ఒక టికెట్‌పై ఒక వ్యక్తికి అనుమతి ఉంటుందని జిల్లా కలెక్టర్‌ జి.లక్ష్మీ కాంతరెడ్డి తెలిపారు.

చకచకా దసరా సుందరీకరణ పనులు

ఉత్సవాల వీక్షణకు రూ.6500 ధరతో గోల్డ్‌ కార్డు

టికెట్ల విక్రయాలు షురూ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement