హుబ్లీ: దేశంలో లవ్ జిహాద్ పెరిగి పోయింది. ముస్లింలు తమ పిల్లలకు బుద్ధి చెప్పాలి. మనకు రాముడి వలే ఏకపత్నీవ్రతుడు అయ్యేది తెలుసు, కృష్ణుడి వలే 16 వేల భార్యలను కట్టుకోవడం తెలుసు. హిందూ యువకులు ముస్లిం యువతులను లవ్ చేయడం ప్రారంభిస్తే ఆ వర్గాలకు ఒక్క పిల్ల కూడా దొరకదని విశ్వ హిందూ పరిషత్ జాతీయ కార్యదర్శి గోపాల్ నాగరకట్టె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బుధవారం హుబ్లీ ఈద్గా మైదానంలో మూడో రోజు వినాయక నిమజ్జన కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఇక్కడి ముస్లింలు అరబ్బు నుంచి వచ్చిన వారు కాదు. వారు మన దేశం వారే. గతంలో మత మార్పిడికి గురైన వారు. వారు హిందూ మతస్తులను ఇఫ్తార్ విందుకు ఆహ్వానిస్తారు. అనేక మంది హిందూ నాయకులు వెళతారు. అలాగే మీరు కూడా వినాయక చవితి వేడుకలకు రావాలని సూచించారు. ముస్లింలు నమాజ్ చేస్తే ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే వినాయకుడి జోలికి వస్తే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాష్ట్ర హోం మంత్రి ప్రియాంక ఖర్గేకు ఆర్‌ఎస్‌ఎస్ గురించి మాట్లాడితే తేలు కుట్టినట్లుగా ఉంటుందన్నారు. ఆయన వందేమాతరం పాడితే హస్తం పోయి కమలం వస్తుందని భయపడుతున్నారు. అయితే వందేమాతరం పాడటానికి ఏ తండ్రి అనుమతి అవసరం లేదు. ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలకు నోటీసులు ఇస్తున్నామని హోం మంత్రి చెప్పారు. రాష్ట్రంలో కరువుకు గోవధ కూడా కారణం అన్నారు. గోమాతను రక్షించాలి. దేశంలో కోట్లాది మసీదులు, చర్చిలు ఉన్నాయి. వీటి ఆదాయంపై దృష్టి సారించని డీకే.శివకుమార్ ప్రభుత్వం కన్ను హిందూ దేవాలయాల మీద పడిందన్నారు. మసీదులకు పాలనాధికారులను నియమించే ధైర్యం ప్రభుత్వానికి లేదు. ఇలా అయితే దేవాలయాల నిర్వహణ మీకెందుకని ప్రభుత్వాన్ని నిలదీశారు. దేశంలోని అన్ని దేవాలయాలను హిందూ ధర్మీయులకు ఇచ్చి వేయాలని ఆయన డిమాండ్ చేశారు.


