బళ్లారిఅర్బన్: గ్రాండ్ మాస్టర్ అరుణ్‌కుమార్ మార్గదర్శకత్వంలో నగరంలోని సంగనకల్లు రోడ్డులోని కేఆర్‌ఎస్ ఫంక్షన్ హాల్‌లో ఈనెల 18, 19, 20 తేదీల్లో మూడు రోజుల పాటు బళ్లారి ధ్యాన మహా యజ్ఞం–10 పిరమిడ్ ధ్యాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. బుధవారం నగరంలోని పత్రికా భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఆధునిక జీవన విధానంలో ప్రజలు మానసిక, శారీరక ఒత్తిళ్లకు గురవుతున్నారన్నారు. ధ్యానం ద్వారా ఒత్తిడిని తగ్గించుకుని మానసిక ప్రశాంతత పొందవచ్చని తెలిపారు. నగర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. గ్రాండ్ మాస్టర్ అరుణ్‌కుమార్, హనుమన గౌడ పరశురామ్, బాలకృష్ణ, విజయలక్ష్మి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.


