ఘనంగా గజానన రథోత్సవం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా గజానన రథోత్సవం

Sep 16 2026 4:01 AM | Updated on Sep 16 2026 4:01 AM

శ్రీనివాసపురం: కోలారు జిల్లా ముళబాగిలు తాలూకా కురుడుమలై గ్రామంలో వెలసిన పురాణ ప్రసిద్ధ కురుడుమలై వినాయక దేవస్థానంలో గణేశ చతుర్థి వేడుకలు వైభవంగా జరిగాయి. విఘ్ననాథుని తేరు ఉత్సవం కనులపండువగా సాగింది. మంగళవాయిద్యాల నడుమ ఉత్సవమూర్తిని రథంలో ప్రతిష్టించి తేరును లాగారు. ముళబాగిలు ఎమ్మెల్యే సమృద్ధి మంజునాథ్‌, వేలాది భక్తజనం పాల్గొన్నారు. తేరు మీదకు అరటిపండ్లు, దవనం విసిరారు. భక్తబృందాల కోలాటం, నృత్యాలు అలరించాయి. కోలారు ఎమ్మెల్యే కొత్తూరు మంజునాథ్‌, ఎమ్మెల్సీ ఎం ఎల్‌ అనిల్‌కుమార్‌ పాల్గొన్నారు.

కురుడుమలైలో భక్తసంద్రం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement