● కేంద్రమంత్రి నడ్డా
బనశంకరి: ఈ నెల 17 నుంచి బీజేపీ ద్వారా సేవా సంకల్ప అభియాన్ నిర్వహిస్తామని కేంద్రమంత్రి జేపీ నడ్డా తెలిపారు. మంగళవారం బెంగళూరు బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడారు. సుపరిపాలన, ప్రజా సంక్షేమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ప్రధాని గత 25 ఏళ్లలో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకపోవడం మనందరికీ గర్వకారణమన్నారు. సేవకుని రూపంలో మోదీ పనిచేస్తున్నారని, ఆయనను గౌరవిస్తూ ఒక నెల సేవా సంకల్ప అభియాన్ నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యడియూరప్ప, విజయేంద్ర, అశోక్ తదితరులు పాల్గొన్నారు.


