మరమ్మతు చేయాలని ధర్నా | - | Sakshi
Sakshi News home page

మరమ్మతు చేయాలని ధర్నా

Sep 16 2026 3:25 AM | Updated on Sep 16 2026 3:25 AM

కేజీఎఫ్‌: నగరంలోని బోరిలాల్‌ పేట, అశ్వత్‌ కాలనీలను కలిపే లింక్‌ రోడ్డుకు మరమ్మతు చేయాలని ఆర్‌కె ఫౌండేషన్‌ అధ్యక్షుడు మోహన కృష్ణ డిమాండ్‌ చేశారు. మంగళవారం స్థానిక కాలనీవాసులతో కలిసి ప్రతిఘటన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రహదారి పూర్తిగా అధ్వానంగా ఉండటంతో రెండు రోజుల క్రితమే ఓ మహిళ కిందపడి చేయి విరిగిందన్నారు. ఈ విషయాన్ని నగరసభ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం కనిపించలేదన్నారు. యూజీడీకి మూత వేయకపోవడంతో ప్రజలు పట్టుతప్పి అందులో పడి గాయాల పాలైనట్లు పేర్కొన్నారు. నగరసభ అధికారులు ఇప్పటికై నా కళ్లు తెరిచి రోడ్డుకు మరమ్మతు చేయాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement