ఘనంగా ప్రజాస్వామ్య దినోత్సవం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా ప్రజాస్వామ్య దినోత్సవం

Sep 16 2026 3:25 AM | Updated on Sep 16 2026 3:25 AM

హొసపేటె: జిల్లా పరిపాలన, జిల్లా పంచాయతీ, సామాజిక సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో మంగళవారం నగరంలోని డాక్టర్‌ బీఆర్‌.అంబేడ్కర్‌ సర్కిల్‌ వద్ద అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. జిల్లాధికారిణి కవిత ఎస్‌, మన్నికేరి, జెడ్పీ సీఈఓ గరీమా పన్వర్‌, ఏడీసీ పీఎన్‌.లోకేష్‌, అటవీ శాఖ డిప్యూటీ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్స్‌ అనుపమ, సబ్‌ డివిజనల్‌ అధికారి వివేకానంద, సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ వై.ఏ.కాళె బీఆర్‌.అంబేడ్కర్‌ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. సాంఘిక సంక్షేమ శాఖ సహాయ సంచాలకురాలు నజీమా బాను రాజ్యాంగ పీఠికలోని ప్రజాస్వామ్య విలువలను సమర్థిస్తూ ప్రతిజ్ఞ చేయించారు.

రాజ్యాంగ పరిరక్షణ మనందరి బాధ్యత

రాయచూరు రూరల్‌: భారత రాజ్యాంగాన్ని రక్షించడం మనందరి బాధ్యత అని జిల్లాధికారిణి పూవిత అభిప్రాయపడ్డారు. మంగళవారం నగరంలోని పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో జిల్లాధికార యంత్రాంగం, జిల్లా పంచాయతీ, సాంఘీక సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవంలో అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి మాట్లాడారు. భారత సార్వభౌమత్వాన్ని, భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించాలని, సామాజిక, రాజకీయ, ఆర్థిక, న్యాయ విచారాలు, అభివ్యక్తి స్వాతంత్య్రం, ధర్మశ్రద్ధ వంటి వాటిని మనం పాటించాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ ఈశ్వర్‌ కుమార్‌, ఎస్పీ అరుణాంగ్షు గిరి, నగరసభ కమిషనర్‌ జుబిన్‌ మహాపాత్రో, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కృష్ణ, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు శివశంకర్‌, విద్యా శాఖాధికారులు మల్లికార్జున, చంద్రశేఖర్‌, తహసీల్దార్‌ సురేష్‌వర్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement