జిల్లా ఇంచార్జి మంత్రిగా అజయ్‌సింగ్‌ వద్దు | - | Sakshi
Sakshi News home page

జిల్లా ఇంచార్జి మంత్రిగా అజయ్‌సింగ్‌ వద్దు

Aug 14 2026 7:26 AM | Updated on Aug 14 2026 7:26 AM

రాయచూరు రూరల్‌: రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వంలో రాయచూరు జిల్లా ఇంచార్జి మంత్రిగా చిన్న నీటిపారుదల శాఖ మంత్రి అజయ్‌ సింగ్‌ను నియమించడంపై రాయచూరు నాగరిక వేదిక కార్యకర్తలు నిరసన చేపట్టారు. గురువారం అంబేడ్కర్‌ సర్కిల్‌ వద్ద చేపట్టిన ఆందోళనలో బసవరాజ్‌ కళస మాట్లాడారు. ముఖ్యమంత్రి శివ కుమార్‌ కళ్యాణ కర్ణాటకలో కలబుర్గికి ప్రియాంక్‌ ఖర్గెను, యాదగిరికి శరణ ప్రకాష్‌ పాటిల్‌ను, బీదర్‌కు ఈశ్వర్‌ ఖండ్రెను, కొప్పళకు శివరాజ్‌ తంగడిగిని, బళ్లారికి నాగేంద్రను ఇంచార్జి మంత్రిగా నియమించారన్నారు. అయితే రాయచూరుకు మాత్రం జిల్లా వారిని కాకుండా ఇతర జిల్లాల వారిని నియమించి అన్యాయం చేశారన్నారు. ఈనెల 15న జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు వస్తున్న ఇంచార్జి మంత్రి అజయ్‌సింగ్‌ గోబ్యాక్‌ అంటూ ఘెరావ్‌ చేస్తామని హెచ్చరించారు. ఆరోజున జిల్లాలోని శాసన సభ్యులు కూడా కార్యక్రమానికి గైర్హాజరు కావాలని విన్నవించారు. గతంలో మంత్రిగా ఉన్న వారు కూడా కేవలం జాతీయ పండుగలకు మాత్రమే చుట్టపుచూపుగా వచ్చేవారని ఆరోపించారు. జిల్లా వారిని కాదని పొరుగు జిల్లా వారిని ఇంచార్జిగా నియమించడంపై ఆక్రోశం వ్యక్తం చేశారు.

జిల్లా వారినే ఇంచార్జిగా నియమించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement