హంపీలో తిరంగా సెల్ఫీ పాయింట్‌ | - | Sakshi
Sakshi News home page

హంపీలో తిరంగా సెల్ఫీ పాయింట్‌

Aug 14 2026 7:26 AM | Updated on Aug 14 2026 7:26 AM

హొసపేటె: కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన హర్‌ ఘర్‌ తిరంగా అభియాన్‌లో భాగంగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన హంపీలో హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా హంపీ సర్కిల్‌ వారు హంపీలోని ప్రపంచ ప్రసిద్ధ కమల్‌ మహల్‌ సమీపంలో పర్యాటకుల కోసం హర్‌ ఘర్‌ తిరంగా సెల్ఫీ పాయింట్‌ను ఏర్పాటు చేశారు. హంపీకి వచ్చే పర్యాటకులు ఈ సెల్ఫీ పాయింట్‌ వద్ద ఫోటోలు తీసుకుంటూ 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకునే అవకాశాన్ని కల్పించారు. అంతేకాకుండా హంపీలోని హజారరామ దేవస్థానం గోడపై త్రివర్ణ పతాకం లేజర్‌ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. త్రివర్ణ పతాకంపై అవగాహన కల్పించే ప్రయత్నంలో భాగంగా హంపీ సర్కిల్‌లోని ప్రసిద్ధ కమల్‌ మహల్‌, బీదర్‌ కోట వద్ద హర్‌ఘర్‌ త్రివర్ణ సెల్పీ పాయింట్‌ను ఏర్పాటు చేశారు. హజారరామ ఆలయ గోడపై ప్రొజెక్టర్‌ ఉపయోగించి భారీ త్రివర్ణ పతాక ప్రదర్శనను ఏర్పాటు చేశామని ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా హంపీ సర్కిల్‌ ఆర్కియాలజీ సీనియర్‌ సూపరింటెండెంట్‌ కే.రామకృష్ణారెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement