మైసూరు: ఎటుచూసినా మువ్వన్నెల పతకాలు రెపరెపలాడాయి. విద్యాలయాలు, కూడళ్లు, నదుల మీద దేశభక్తి ఉప్పొంగింది. ప్రజలు రెట్టించిన ఉత్సాహంతో హర్ ఘర్ తిరంగాలో పాల్గొన్నారు. మైసూరు నగరంలోని ఎస్‌బీఆర్‌ఆర్ మహారాజా డిగ్రీ కాలేజీ ఆధ్వర్యంలో నిర్వహించారు. విద్యార్థులు, ఎన్‌సీసీ కెడెట్లు వందేమాతర గీతం ఆలపించారు. చిక్కమగళూరులో వందల అడుగుల పొడవైన పతాకంతో ర్యాలీ చేశారు. బాగల్‌కోటె జిల్లాలో ఘటప్రభ నదిలో కొందరు ఔత్సాహికులు దోణెల్లో జెండాలను పట్టుకుని సందడి చేశారు. హుబ్లీ నగరంలో వేలాది విద్యార్థులు జెండాలు పట్టుకుని ప్రదర్శన నిర్వహించారు.
ఉత్సాహంగా ఇంటింటా త్రివర్ణ పండుగ


