కమర్షియల్ వీధిలో
అస్తవ్యస్త పార్కింగ్ (ఫైల్)
బనశంకరి: నగర వాహనదారుల దూకుడు నియంత్రణకు గ్రేటర్ బెంగళూరు కొత్తపార్కింగ్ విధానం అమల్లోకి తీసుకురానుంది. రోడ్లను మూడు విభాగాలుగా విభజించి ఫీజులు వసూలు చేయనుంది. ఆఫ్ స్ట్రీట్ పార్కింగ్, ఆన్‌స్ట్రీట్ పార్కింగ్, నెల పార్కింగ్ పాస్ ధరలను నిర్ణయించింది.
ఈ స్థలాల్లో పార్కింగ్ నిషేధం
మెట్రో, ప్రముఖ బస్‌స్టేషన్ల చుట్టుపక్కల ప్రదేశాలు, అర్టీరియల్ రోడ్లు, ట్రాఫిక్ సిగ్నళ్ల నుంచి 50 మీటర్ల పరిధిలో, మెయిన్‌రోడ్డు జంక్షన్ల నుంచి 25 మీటర్ల దూరం వరకు ప్రజలు వాహనాలను పార్క్ చేయరాదు. రాత్రివేళ కొన్నిచోట్ల మినహాయింపు ఉంటుంది. ఇళ్లలో బాడుగ ఉన్నవారు రోడ్లపై బైక్‌లు, కార్లను పార్కింగ్ చేస్తే ఇంటి యజమాని జరిమానా భరించాలి. ఖాళీ స్థల యజమానులు ప్రజల వాహనాల పార్కింగ్‌కు అవకాశమిస్తే వారికి ఆస్తి పన్నులో రాయితీ ఇస్తారు.
బైక్‌లకు గంటకు
రూ.40, కార్లకు రూ.80
గ్రేటర్ బెంగళూరు చర్యలు
ఆన్ స్ట్రీట్ పార్కింగ్ ఫీజు ప్రతి గంటకు
బైక్‌లకు రూ.40, కార్లు, చిన్న వాహనాలకు రూ.80
ఆఫ్‌స్ట్రీట్ పార్కింగ్
ద్విచక్రవాహనాలకు రూ.20, లఘు వాహనాలకు రూ.40
నెలవారి ఆఫ్ స్ట్రీట్ పాస్ ధర
ద్విచక్రవాహనాలకు రూ.2 వేలు, లఘువాహనాలకు రూ.4,000
మూడింటిలోనూ, బీ, సీ రోడ్లలో చార్జీలు కొంచెం తగ్గుతాయి.


