పోటీ పరీక్షలపై విద్యార్థులకు కార్యశాల | - | Sakshi
Sakshi News home page

పోటీ పరీక్షలపై విద్యార్థులకు కార్యశాల

Aug 14 2026 7:26 AM | Updated on Aug 14 2026 7:26 AM

బళ్లారిఅర్బన్‌: జిల్లా మాదిగ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సమాజంలోని విద్యార్థుల కోసం పోటీ పరీక్షలపై ఒక రోజు కార్యశాలను నగరంలోని మయూర హోటల్‌ ఎదురుగా ఉన్న అంబేడ్కర్‌ సంఘం సమావేశ మందిరంలో నిర్వహించారు. కార్యశాలను ప్రారంభించి సంఘం అధ్యక్షుడు, ఉప తహసీల్దార్‌ విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి, యువత భవిష్యత్తుకు సంఘం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. గౌరవాధ్యక్షుడు చామరాజ్‌, ప్రాథమిక ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు నింగప్ప విద్య ప్రాధాన్యత గురించి వివరించారు. విద్యార్థులను పోటీ పరీక్షలకు సిద్ధం చేసేందుకు వచ్చిన రిసోర్స్‌ పర్సన్లు బసవరాజ్‌, శేఖర్‌ పోటీ పరీక్షల సిలబస్‌ను ఎలా విభజించుకోవాలి? వివిధ అంశాలను ఎలా అధ్యయనం చేయాలి? పరీక్ష విధానాలను ఎలా అర్థం చేసుకోవాలి? అనే విషయాలపై అవగాహన కల్పించారు. చిగురు కళా బృందం ఆధ్వర్యంలో విప్లవ గీతాలను ఆలపించారు. ప్రధాన కార్యదర్శి జడేష్‌, ఉపాధ్యక్షుడు గోవిందరాజు, కోశాధికారి హులెప్ప, ఎరిస్వామితో పాటు సంఘం ఇతర పదాఽధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement