హాస్టళ్లలో జిల్లాధికారి ఆకస్మిక తనిఖీ | - | Sakshi
Sakshi News home page

హాస్టళ్లలో జిల్లాధికారి ఆకస్మిక తనిఖీ

Aug 14 2026 7:26 AM | Updated on Aug 14 2026 7:26 AM

బళ్లారి రూరల్‌ : దావణగెరె జిల్లాధికారి జీ.ఎం.గంగాధరస్వామి బుధవారం రాత్రి ప్రభుత్వ వసతి నిలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నగరంలోని సాంఘీక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని డాక్టర్‌ బీ.ఆర్‌.అంబేడ్కర్‌ హాస్టల్‌, క్రీడావసతి నిలయంలో తనిఖీ నిర్వహించారు. హాస్టళ్లలో మెనూ ప్రకారం తయారు చేసిన సాంబారు, కూరగాయలు, ఆహార ధాన్యాల నాణ్యతను పరిశీలించారు. పాలు, మజ్జిగ పలుచగా ఉండటంతో చిక్కనైన పాలు, మజ్జిగను అందించాలని అధికారులకు సూచించారు.

హాస్టళ్లలో గదులు, వంట గది, స్నానాల గదుల్లో శుభ్రత పాటించాలని ఆదేశించారు. నిర్వహణలో లోపాలను సరిదిద్దుకోవాలని తెలిపారు. క్రీడా వసతి నిలయంలో నేమ్‌ప్లేట్‌ లేని ద్విచక్రవాహనాలను స్వాధీనపరుచుకున్నారు. జిల్లాధికారి వెంట అధికారులు పాల్గొన్నారు.

విద్యార్థులకు నాణ్యమైన ఆహారం

అందించాలని అధికారులకు సూచన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement