నేటి రాష్ట్ర బంద్‌పై భిన్నగళాలు | - | Sakshi
Sakshi News home page

నేటి రాష్ట్ర బంద్‌పై భిన్నగళాలు

Aug 13 2026 12:57 AM | Updated on Aug 13 2026 12:57 AM

బనశంకరి: కావేరి జలాలను తమిళనాడుకు విడుదల చేయరాదని కన్నడ సంఘాలు నేడు గురువారం రాష్ట్ర బంద్‌కు సిద్ధం కావడంతో అంతటా టెన్షన్‌ నెలకొంది. అసెంబ్లీ కూడా ప్రారంభం కానుండడంతో ఏం జరుగుతుందోనని చర్చనీయాంశమైంది. కానీ బంద్‌కు ఒకరోజు ముందు కన్నడ సంఘాల మధ్య అనైక్యత కనిపించింది. కొన్ని సంఘాలే బంద్‌కు మద్దతుగా నిలిచాయి. కొన్ని సంఘాలు బంద్‌కు వ్యతిరేకత వ్యక్తం చేశాయి. వాటాళ్‌ నాగరాజు మాత్రం బంద్‌ చేస్తామని చెబుతున్నారు.

యథావిధిగా పనిచేస్తాం...

హోటళ్ల యజమానుల సంఘం, ప్రైవేటు రవాణా సంఘాలు, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల ఒక్కూట బంద్‌కు నైతిక మద్దతు మాత్రమే ఇస్తామని తెలిపాయి. తమ సేవలను యథావిధిగా కొనసాగిస్తామని తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వం బంద్‌ వద్దు అని విన్నవించిందన్నారు. ప్రైవేటు పాఠశాలలు, బస్సులు, వాహనాలు మామూలుగా పనిచేస్తాయని తెలిపారు. కరవే ప్రవీణ్‌శెట్టి వర్గం బంద్‌కు మద్దతు లేదని ప్రకటించింది. ఈ దశలో ప్రధాని జోక్యం చేసుకోవాలన్నారు. వాటాళ్‌ నాగరాజ్‌ బంద్‌ను విరమించేది లేదని, నగరంలో పర్యటించి ప్రజలు బంద్‌ పాటించాలని కోరతామని చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో బంద్‌ జరిగేనా, జరిగినా అంతంతమాత్రంగా ఉండవచ్చని భావిస్తున్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, వ్యాపార సంస్థలు, దుకాణాలు, మాల్స్‌ తెరిచే ఉంచుతారని తెలిసింది.

కొన్ని సంస్థలే మద్దతు

కావేరి జలాల వ్యవహారం..

ప్రభావం ఉండకపోవచ్చని అంచనా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement