బనశంకరి: నూతన మంత్రులకు ప్రభుత్వం శాఖలను కేటాయించింది. సర్కారు అందజేసిన జాబితాకు గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ గురువారం ఆమోదించారు. పాత మంత్రులు మునియప్ప, రామలింగారెడ్డి శాఖలు మారాయి. నూతన మంత్రులు, మారిన మంత్రుల శాఖల వివరాలు...
= సీఎం డీకే శివకుమార్– ఆర్థికం, కేబినెట్ వ్యవహారాలు, పరిపాలన, ఇంటెలిజెన్స్, సమాచార, మానవ హక్కులు, సామాజిక న్యాయం, అసెంబ్లీ వ్యవహారాలు, వ్యవసాయ మార్కెటింగ్, పట్టణ, దేశీయ ప్లానింగ్ కమిషనరేట్లు, పట్టణ స్థానిక సంస్థలు, ఇతర కేటాయించని శాఖలు
చలువరాయకు జల వనరులు
1.లక్ష్మణ సవది–సహకార 2.రామలింగారెడ్డి–అటవీశాఖ, పర్యావరణం 3.కేహెచ్.మునియప్ప–సాంఘిక సంక్షేమం 4.సంతోష్‌లాడ్– కార్మిక శాఖ, ఉద్యోగ కల్పన 5.యుటీ.ఖాదర్– ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, మైనార్టీ సంక్షేమం, హజ్, వక్ఫ్
6. శివరాజ్ తంగడగి–బీసీ సంక్షేమం, కన్నడ సంస్కృతి
7.బసవరాజ రాయరెడ్డి–ఉన్నత విద్య 8.హెచ్‌సీ.బాలకృష్ణ– మున్సిపల్ పరిపాలన
9.కేఎస్.బసవంతప్ప–దేవాదాయ, మత్స్య శాఖ, పోర్టులు 10. ఎన్.చలువరాయస్వామి– భారీ, మధ్యతరహా జలవనరులు 11.మధు బంగారప్ప– ప్రాథమిక, సెకండరీ విద్య
12.ఎస్‌ఎస్.మల్లికార్జున్–గనులు, భూ విజ్ఞానశాఖ, ఉద్యాన శాఖ
13.బీ.నాగేంద్ర–ప్లానింగ్, స్టాటిటిక్స్
14. పీఎం.నరేంద్రస్వామి–వ్యవసాయశాఖ
15.సీ.పుట్టరంగశెట్టి–పశుసంవర్ధక శాఖ, పట్టు 16.టి.రఘుమూర్తి–ఎస్టీ సంక్షేమం 17.రిజ్వాన్ అర్షద్– ఆహార పౌరసరఫరాలు 18.రుద్రప్పలమాణి– చక్కెర, జౌళి 19.శివలింగేగౌడ–ఎకై ్సజ్ శాఖ 20.విజయానంద కాశప్పనవర్–చిన్నతరహా పరిశ్రమలు, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ 21.జమీర్ అహ్మద్ ఖాన్–గృహ వసతి 22.అజయ్ సింగ్–చిన్ననీటిపారుదల, సైన్స్ అండ్ టెక్నాలజీ
ఇద్దరు సీనియర్లకు మార్పులు


