1.08 కోట్ల ఓటర్లు సందేహమే | - | Sakshi
Sakshi News home page

1.08 కోట్ల ఓటర్లు సందేహమే

Aug 13 2026 12:57 AM | Updated on Aug 13 2026 12:57 AM

దొడ్డబళ్లాపురం: ఓటరు ప్రత్యేక సమగ్ర సమీక్ష (ఎస్‌ఐఆర్‌– సర్‌) ప్రక్రియలో రాష్ట్రంలో 1,08,75,304 (19 శాతం) ఓటర్లను ఏఎస్‌డీడీఓ కింద వర్గీకరించినట్టు సీఈఓ అన్బుకుమార్‌ తెలిపారు. బీఎల్‌ఓలు ఇంటింటికి వెళ్లినప్పుడు ఓటర్లు అందుబాటులో లేకున్నా, ఆచూకీ లేకున్నా, ఇల్లు ఖాళీ చేసి ఉన్నా, మరణించినా ఈ కేటగిరీలో చేర్చినట్లు తెలిపారు.

మొత్తం 5.54 కోట్ల ఓటర్లు

బుధవారం ఆయన బెంగళూరులో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న 5.54కోట్ల మంది ఓటర్లలో, ఏఎస్‌డీడీఓ ఓటర్లు 19 శాతం మంది ఉన్నారన్నారు. రాష్ట్రంలో 5,54,32,314 ఎన్యూమరేషన్‌ ఫారాలను బీఎల్‌ఓల ద్వారా పంపిణీ చేశామన్నారు. వాటిలో 4,45,57,010 ఫారాలను (80.38 శాతం) డిజిటలైజేషన్‌ చేసినట్లు తెలిపారు.

16 లక్షల ఓటర్లు మృతి

65,73,976 మంది ఓటర్లు శాశ్వతంగా చిరునామా మారినట్టు, 16,36,673 మంది ఓటర్లు మృతి చెందినట్టు, 7,01,412 మంది రెండు చోట్ల ఓట్లు కలిగి ఉన్నట్టు తెలిపారు. 4,14,486 మంది ఇతర కేటగిరీ ఓటర్లు ఉన్నట్టు తెలిపారు.

ఓటరుగా చేరండి

ఓటర్ల లిస్టులో సందేహాలు ఉంటే బీఎల్‌ఓలకు కాల్‌ చేసి నివృత్తి చేసుకోవాలన్నారు. కొత్త ఓటరుగా చేరడానికి ఫారం– 6 కింద అప్లికేషన్‌ ఇవ్వాలన్నారు. మొదటి ఓటర్ల లిస్టును ఈ నెల 24న ప్రకటిస్తామని తెలిపారు.

వారందరూ ఏఎస్‌డీడీఓ కేటగిరీలో

సీఈఓ అన్బుకుమార్‌ ప్రకటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement