హెల్మెట్‌ ధరించి వాహనం నడపండి | - | Sakshi
Sakshi News home page

హెల్మెట్‌ ధరించి వాహనం నడపండి

Jul 21 2026 12:41 AM | Updated on Jul 21 2026 12:41 AM

రాయచూరు రూరల్‌: నగరంలో హెల్మెట్‌ ధరించి వాహనాలు నడపాలని ట్రాఫిక్‌ పోలీస్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఈరేష్‌ నాయక్‌ తెలిపారు. సోమవారం బీఆర్‌బీ కళాశాలలో విద్యార్థులకు సదర్‌ బజార్‌ పోలీసులు ఏర్పాటు చేిసిన సంచార నియమాల గురించి మాట్లాడారు. ట్రాఫిక్‌ నియమాలను ఉల్లంఘిస్తే నూతనంగా సీసీ కెమెరాలను అమర్చారన్నారు. నగరంలో 5 చోట్ల 18 ఏఐ కెమెరాలను ఏర్పాటు చేశామని తెలిపారు. సీట్‌ బెల్ట్‌, మద్యం తాగి వాహనాలను నడపడం, మొబైల్‌తో మాట్లాడుతూ వాహనాలు వేగంగా నడిపితే వారికి జరిమానా విధిస్తామన్నారు. సంచార నియమాలను ఉల్లంఘించడం, త్రిబుల్‌ రైడింగ్‌కు అవకాశం లేదన్నారు. కార్యక్రమంలో సదర్‌ బజార్‌ మహిళా పోలీసు స్టేషన్‌ సీఐ అమరేష్‌, లక్ష్మిలున్నారు.

తిడిగోళ నిందితులను

అరెస్ట్‌ చేయాలి

రాయచూరు రూరల్‌: దళితులపై దాడులు చేసిన తిడిగోళ నిందితులను అరెస్ట్‌ చేయాలని దళిత సంఘర్ష సమితి డిమాండ్‌ చేసింది. సోమవారం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు మాట్లాడారు. సింధనూరు తాలూకా తుర్విహాళ పరిధిలోని తిడిగోళలో రాఘవేంద్రపై తీసుకున్న అప్పులు చెల్లించడంలో ఆలస్యం చేయడంతో ఇవ్వని పక్షంలో దాడి చేశారని, అలాంటి వారిపై కేసులు నమోదు చేసిన ఎస్‌ఐ వారిపై చర్యలు చేపట్టడంలో విఫలమయ్యారని, దాడి చేసిన వారిని అరెస్ట్‌ చేయాలని కోరుతూ తహసీల్దార్‌ సురేష్‌వర్మకు వినతిపత్రం సమర్పించారు.

సోనం వాంగ్‌చుక్‌ అరెస్టు తగదు

రాయచూరు రూరల్‌ : కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిరవధిక ధర్నా చేస్తున్న సోనం వాంగ్‌చుక్‌ను బంధించడాన్ని ఏఐడీఎస్‌ఓ ఖండించింది. సోమవారం సూపర్‌ మార్కెట్‌ వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు మహేష్‌ మాట్లాడారు. దేశ వ్యాప్తంగా జరిగిన నీట్‌ పరీక్షల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని, విద్యా సంవత్సరాలను వృథా చేయడాన్ని ఖండించారు. నీట్‌ పరీక్షల్లో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టి తప్పులు చేసిన వారిని అరెస్ట్‌ చేయాలని కోరుతూ ఆందోళన చేశారు.

దురలవాట్లకు

దూరంగా ఉండాలి

రాయచూరు రూరల్‌: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు దురలవాట్లకు దూరంగా ఉండాలని డయట్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ చంద్రశేఖర్‌ భండారి పేర్కొన్నారు. సోమవారం రాయచూరు తాలూకా ఉడుంగల్‌ ఖానాపూర్‌ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ధూమపానం, మద్యపానం, కల్లు, గుట్కా, పాన్‌ మసాల వంటి విషపూరిత ఆహార పదార్థాల సేవనంతో ఆరోగ్యం పాడు చేసుకోరాదని అన్నారు. నేటి యువత అధిక మొబైల్‌ వాడకం వల్ల దారి తప్పుతున్నారని, దాని వినియోగాన్ని తగ్గించుకుని విద్యా రంగం వైపు దృష్టి సారించాలన్నారు. కసాప కార్యదర్శి దండెప్ప బిరాదార్‌, వీరేష్‌, శివలీల, వీణా, సరస్వతి, సావిత్రి, నఫీజా అంజుమ్‌లున్నారు.

కేంద్ర మంత్రి చిత్రపటం దహనం

రాయచూరు రూరల్‌ : దేశ వ్యాప్తంగా జరిగిన నీట్‌ పరీక్షల్లో చోటు చేసుకున్న అక్రమాలకు నైతిక బాధ్యతగా కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని సీపీఎం నేతలు డిమాండ్‌ చేశారు. సోమవారం టిప్పుసుల్తాన్‌ ఉద్యానవనంలో చేపట్టిన ఆందోళనలో వీరేష్‌ మాట్లాడారు. పిల్లల జీవితాలతో చెలగాటం ఆడుతూ విద్యా సంవత్సరాలను వృథా చేయడాన్ని ఖండించారు. న్యూఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వారికి న్యాయం జరిగేలా చూడాలని కోరుతూ నిరవధిక ధర్నా చేస్తున్న సోనం వాంగ్‌చుక్‌ను బంధించడాన్ని వ్యతిరేకించారు. నీట్‌ పరీక్షల్లో జరిగిన అక్రమాలపై విచారణ జరిపి దోషులను శిక్షించాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ చిత్రపటాన్ని దహనం చేశారు. ఆందోళనలో శరణ బసవ, కరియప్ప, గోకారమ్మ, వరలక్ష్మి, పద్మ, జిలానీ పాషాలున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement