హొసపేటె: విజయనగర జిల్లా హరపనహళ్లిలో విద్యుదాఘాతానికి గురై ఒక రైతు మృతి చెందిన ఘటన సోమవారం జరిగింది. మృతుడిని రైతు ప్రవీణ్ (25)గా గుర్తించారు. తన పొలంలో పండించిన పంటకు నీరు ప్రవీణ్ పొలానికి పెట్టడానికి వెళ్లాడు. అదే సమయంలో అతని స్నేహితులు పొలం వద్దకు వెళ్లారు. ప్రవీణ్ పొలంలో కనిపించకపోవడంతో వారు అతనిని పిలిచారు. అతను పిలుపునకు స్పందించక పోవడంతో ఆందోళన చెందిన స్నేహితులు మోటార్ పంపు సెట్ వద్దకు వెళ్లి వెతకగా, ప్రవీణ్ విద్యుదాఘాతానికి గురై మరణించినట్లు కనుగొన్నారు. సకాలంలో విద్యుత్ సరఫరా లేక పోవడంతో కరెంట్ ఉందో లేదో చూసుకోవడానికి పంపుసెట్ వద్దకు వెళ్లిన రైతులు మరణిస్తున్నారు. జెస్కాం శాఖ అధికారుల నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు.


