హొసపేటె: నగర శివార్లలోని గుండా అటవీ ప్రాంతం వద్ద ఉన్న సొరంగ మార్గం రహదారి మధ్యలో విండ్ టర్బైన్‌ను తీసుకు వెళ్తున్న ఒక భారీ లారీ బోల్తా పడటంతో జాతీయ రహదారి– 50పై అర్ధరాత్రి 12 గంటల వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడిన ఘటన ఆదివారం రాత్రి జరిగింది. పవన విద్యుత్ టర్బయిన్‌ను తీసుకువెళ్తున్న వాహనం చిత్రదుర్గ నుంచి గదగ్ వైపు వెళ్తుండగా గుండా అటవీ ప్రాంతం సమీపంలోని ఒక మలుపు వద్ద డ్రైవర్ వాహనంపై అదుపు కోల్పోయి బోల్తా పడింది. పెద్ద వాహనం కావడంతో వాహనాలకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో జాతీయ రహదారిపై వాహనాల రద్దీ ఏర్పడింది. విషయం తెలిసిన వెంటనే విజయనగర ఎస్పీ జాహ్నవి ఘటన స్థలానికి చేరుకుని వాహనాల ట్రాఫిక్ జామ్‌ను నివారించేందుకు నిరంతరంగా కష్టపడ్డారు. డీఎస్పీ మల్లేష్ దొడ్డమని, హెచ్‌బీ హళ్లి సీఐ వికాస్ లమాణి, హొసపేటె రూరల్ స్టేషన్ సీఐ గురురాజ్ కట్టిమని, ఆర్‌పీఐ గోవిందప్ప, టౌన్ స్టేషన్ ఎస్‌ఐ తారాబాయి, 50–60 మంది సిబ్బంది కృషితో అర్ధరాత్రికి ట్రాఫిక్‌ను అదుపులోకి తెచ్చి వాహనాల రాకపోకలను పునరుద్ధరించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కున్న వాహనాలు


