బళ్లారిఅర్బన్: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టిన సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్ అరెస్టును ఖండిస్తూ ఎస్‌ఎఫ్‌ఐ, అఖిల భారత ప్రజాస్వామ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో సోమవారం బళ్లారిలో జిల్లాధికారి ద్వారా రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించారు. జాతీయ విధానంలో పరీక్షల నిర్వహణలో జరిగిన అవకతవకలపై శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న సోనం వాంగ్‌చుక్‌ను అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య హక్కులకు విరుద్ధమని వినతిపత్రంలో పేర్కొన్నారు. సోనం వాంగ్‌చుక్‌తో పాటు అరెస్ట్ చేసి వారిని వెంటనే విడుదల చేయాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) పని తీరుపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ దొడ్డబసవరాజ్, ఏఐడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు చంద్రకుమారి, రాజేంద్ర ప్రసాద్, వరదరాజు తదితరులు పాల్గొన్నారు.


