గనుల శాఖలో బదిలీల సర్జరీ
సర్ ప్రక్రియకు అనుకూలంగా సర్కారు చర్యలు
శివాజీనగర: బీజేపీ, జేడీఎస్ నేతలు వ్యతిరేకిస్తున్నా ధ్రువపత్రాల జారీలో సర్కారు పట్టు వీడలేదు. రాష్ట్రంలో కొనసాగుతున్న ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)కు మద్దతుగా శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రాలు, కుల ధ్రువీకరణ పత్రాలను పంపిణీ చేసే ప్రక్రియకు సీఎం డీకే శివకుమార్ సోమవారం నాంది పలికారు. విధానసౌధలో ఆన్‌లైన్ సేవలను ప్రారంభించి మాట్లాడారు. ఎన్నికల సంఘం ఆమోదించిన శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రాలు, కుల ధ్రువీకరణ పత్రాలను ఇంటింటికి ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంటింటికి వెళ్లి సర్టిఫికెట్లను ఇవ్వడం లేదు, కానీ మా ప్రభుత్వం ప్రజల బాగు కోసం కృషి చేస్తోందని చెప్పారు.
ఓటు లేకుంటే పథకాలు కట్...
మీ ఓటు మీ హక్కు అని తాను మొదటి నుంచి చెబుతూనే ఉన్నానని సీఎం అన్నారు. శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రం, లేదా కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేసే నిర్ణయం హఠాత్తుగా తీసుకోలేదని, ఎన్నికల సంఘంతో చర్చించి, నిబంధనలను సమీక్షించామని చెప్పారు. ప్రతిపక్ష పార్టీల నేతలు అనవసర ప్రచారం చేస్తున్నారు, అందులో అర్థమే లేదన్నారు. ఓటరు జాబితాలో పేరు లేకపోతే ప్రభుత్వ సౌకర్యాలను కోల్పోతారు. అందువల్ల ప్రతి ఒక్కరూ చొరవ తీసుకుని ఓటరు జాబితాలో తమ పేరును నమోదు చేసుకోవాలి. ఇందుకు సర్కారు సహకారం అందిస్తుందని చెప్పారు. కావలసిన సర్టిఫికెట్లను నేరుగా గానీ, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడం ద్వారా పొందవచ్చని వివరించారు.
4.85 కోట్ల మందికి..
డీసీఎం జి.పరమేశ్వర్ మాట్లాడుతూ, సర్ ప్రక్రియ కోసం ప్రజలకు 11 ప్రమాణాల ద్వారా శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తామన్నారు. వారు రాష్ట్రంలో 10 ఏళ్లు నివసించి ఉండాలన్నారు. ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగకుండా మేము ఇంటింటికీ వెళ్లి పత్రాలను అందజేస్తామని చెప్పారు. రాష్ట్రంలో 2.3 కోట్ల ఎస్సీ, ఎస్టీల కుల సర్టిఫికెట్లు ఉన్నాయి, మొత్తం 4.85 కోట్ల మందికి కుల ధ్రువీకరణ పత్రాలు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.
శాశ్వత నివాస, కుల రికార్డుల జారీ
సర్ కోసం ఉపయోగించండి
సీఎం డీకే శివ ప్రకటన
శివాజీనగర: రాష్ట్ర గనులు, భూగర్భశాస్త్ర శాఖలో దశాబ్దాలుగా ఒకే చోట పనిచేస్తున్న అధికారులకు సీఎం డీ.కే.శివకుమార్ స్థాన చలనం కల్పించారు. అక్రమ మైనింగ్‌ను పూర్తిగా అరికట్టడం, నాయకులు, గనుల వ్యాపారులతో కుమ్మక్కుకు అడ్డుకట్ట వేయడం, శాఖ ఆదాయాన్ని పెంచడం దీని ఉద్దేశమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఉత్తర్వుల ప్రకారం గనుల శాఖలోని వివిధ కేడర్‌లకు చెందిన మొత్తం 160 మంది అధికారులను తక్షణమే వేర్వేరు ప్రదేశాలకు బదిలీ చేశారు. ఇందులో భూ శాస్త్రవేత్తలు 131 మంది, సీనియర్ భూ శాస్త్రవేత్తలు 23 మంది, డిప్యూటీ డైరెక్టర్లు 6 మంది ఉన్నారు. దశాబ్దాలుగా ఒకే కార్యాలయంలో పనిచేస్తూ, రాజకీయ పలుకుబడిని ఉపయోగించి అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. జూలై 1న జరిగిన గనులు, భూగర్భ, గనుల శాఖ సమీక్షా సమావేశంలో ఆ శాఖ కార్యదర్శి రోహిణి సింధూరి, అధికారులు ఎక్కువ కాలం ఒకేచోట పదవిలో కొనసాగడం గురించి ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో సీఎం భారీ బదిలీల సర్జరీ చేపట్టారని సమాచారం.


