పత్తేపూర్‌ వంతెన వర్షార్పణం | - | Sakshi
Sakshi News home page

పత్తేపూర్‌ వంతెన వర్షార్పణం

Jul 29 2025 8:18 AM | Updated on Jul 29 2025 8:18 AM

పత్తే

పత్తేపూర్‌ వంతెన వర్షార్పణం

రాయచూరు రూరల్‌: జిల్లాలో వంతెన నిర్మాణ పనులు చేపడుతున్న నేపథ్యంలో ఇటీవల కురిసిన వర్షాలకు తాత్కాలిక వంతెన కొట్టుకు పోయింది. నెలరోజుల క్రితం రాయచూరు తాలూకా పత్తేపూర్‌లో భారీ వర్షాలకు తాత్కాలిక వంతెన కొట్టుకు పోయింది. ఈ విషయంలో గ్రామీణ శాసన సభ్యుడు బసనగౌడ దద్దల్‌ నేటికీ ఈ గ్రామాల వైపు వెళ్లక, దాని బాగోగులను గురించి పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పత్తేపూర్‌, జాగీర్‌ వెంకటాపూర్‌, రఘునాథనహళ్లి, సుల్తాన్‌పూర్‌, అరళప్పన హుడా తదితర గ్రామాల ప్రజలకు ఈ మార్గంలో వాహన రాకపోకలు స్తంభించి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. రైతులు పొలం పనులకు వెళ్లడానికి, వ్యవసాయ కూలీలు కూలీ పనులకు వెళ్లలేక తల్లడిల్లుతున్నారు. విద్యార్థులు విద్యాభ్యాసం కోసం రాయచూరు వెళ్లడానికి పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలు నిత్యం సంచరించే ఈ వంతెన నిర్మాణ విషయంలో గ్రామీణ ఎమ్మెల్యే బసనగౌడ దద్దల్‌ అధికారులు, కాంట్రాక్టర్లపై చర్యలు చేపట్టాల్సి ఉంది. జిల్లా ఇంచార్జి మంత్రి శరణ ప్రకాష్‌ పాటిల్‌ ఈ విషయంలో అధికారులకు తగిన సూచనలు చేయాలి.

నరకయాతనలో ఐదు గ్రామాల ప్రజలు

వానలకు ధ్వంసమైన తాత్కాలిక వంతెన

ఈ మార్గంలో నిలిచిన వాహన రాకపోకలు

పత్తేపూర్‌ వంతెన వర్షార్పణం 1
1/1

పత్తేపూర్‌ వంతెన వర్షార్పణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement