
మాదిగ రిజర్వేషన్‌కు ఖర్గే మోకాలడ్డు
రాయచూరు రూరల్: గత 30 ఏళ్ల నుంచి మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణ చేయాలంటూ ఆందోళనలు చేసినా, రాష్ట్ర ప్రభుత్వం మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించడం లేదని మాజీ కేంద్ర మంత్రి నారాయణస్వామి ఆరోపించారు. సోమవారం ప్రైవేట్ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్‌కు వర్గీకరణకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పుత్రుడు ప్రియాంక్ ఖర్గే అడ్డు పడుతున్నారని విమర్శించారు. సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన వెంటనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వర్గీకరణను అమలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. నాగ మోహన్ దాస్ నివేదికలో కూడా లోపాలను సవరించాలన్నారు. ఆది ద్రావిడ, కర్ణాటక పేరుతో ఉన్న ఉప కులాలపై సమీక్ష జరపాలన్నారు. మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణకు ఏ పార్టీ నాయకులు ముందుకు రారని, కేవలం దళితుల ఓట్లు మాత్రమే వారికి కావాలి తప్ప వర్గీకరణ విషయంలో ద్వంద్వ వైఖరిని విడనాడాలన్నారు. ఆగస్టు 11 నుంచి ఫ్రీడం పార్కులో ఆందోళన చేస్తామన్నారు.
మాజీ కేంద్ర మంత్రి నారాయణస్వామి