ఇదేం దోపిడీ.. బాబోయ్‌.. | - | Sakshi
Sakshi News home page

ఇదేం దోపిడీ.. బాబోయ్‌..

Dec 30 2023 1:34 AM | Updated on Dec 30 2023 12:20 PM

- - Sakshi

మైసూరు: వలపు వల విసిరి ట్రాప్‌లోకి లాగే కేటుగాళ్లు ఇప్పుడు ఏకంగా బలవంతంగా ఎత్తుకొచ్చి బెదిరింపులకు పాల్పడుతున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు, కేరళలోని తిరునెల్లికి చెందిన వ్యాపారవేత్త సున్నీ ఫిర్యాదు మేరకు ఒక మహిళతో పాటు ముగ్గురిని మైసూరు నగర పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాలు...కేరళలోని తిరునెల్లికి చెందిన వ్యాపారవేత్త సున్నీ మార్చిలో చైన్నె నుంచి కారులో వస్తున్న సమయంలో మైసూరు మానంద వాడి రోడ్డులో దుండగులు అడ్డుకుని బలవంతంగా ఎత్తుకెళ్లారు.

అనంతరం ఒక ఇంటిలోకి తీసుకెళ్లి ఆయనను బెదిరించి ఓ మహిళ పక్కన నగ్నంగా పడుకోబెట్టి, ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. అనంతరం అతని ఒంటిపై ఉన్న బంగారు చైన్‌, ఉంగరం తీసుకుని అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఫొటోలు, వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేస్తామని బెదిరించి ఉడాయించారు. దీంతో ఆయన రూ. 5 లక్షలు వారికి ఇచ్చాడు. మళ్లీ బెదిరింపులు రావడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు నిఘా ఉంచి నిందితులు ఫజలుల్లా రెహామన్‌, రిజ్వాన్‌, మోనాలను అరెస్ట్‌ చేసి విచారణ చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement