అసంతృప్తులకు బుజ్జగింపులు | - | Sakshi
Sakshi News home page

అసంతృప్తులకు బుజ్జగింపులు

Aug 8 2026 12:29 AM | Updated on Aug 8 2026 12:29 AM

శివాజీనగర: మంత్రి పదవి దక్కక తీవ్ర మనోవేదనకు గురైన విజయనగర కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఎం.కృష్ణప్ప, ఆయన కుమారుడు ప్రియాకృష్ణప్పలను ముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్‌, ఏఐసీసీ కర్ణాటక కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి సుర్జేవాలా పరామర్శించారు. కేపీసీసీ అధ్యక్షుడు బీ.కే.హరిప్రసాద్‌ కూడా కృష్ణప్ప నివాసానికి వెళ్లి చర్చలు జరిపారు. హరిప్రసాద్‌తో మాట్లాడిన అనంతరం కృష్ణప్ప మీడియాతో మాట్లాడారు. తనకు మంత్రి పదవి తప్పకుండా ఇవ్వాలని, అంతకు మించి మరో మార్గం లేదని అన్నారు. కృష్ణప్పతో భేటీ గురించి బీ.కే.హరిప్రసాద్‌ మీడియాతో మాట్లాడుతూ స్నేహపూర్వక వాతావరణంలో చర్చలు జరిగాయన్నారు. సీనియర్‌ నాయకులకు హోదా ఇవ్వనప్పుడు వారు బాధపడటం సహజమన్నారు. ఈ విషయాన్ని రాహుల్‌ గాంధీ దృష్టికి తీసుకెళ్లామన్నారు. త్వరలో రాహుల్‌ స్వయంగా వారితో మాట్లాడి ఓదార్చుతారని అన్నారు. మంత్రి పదవి దక్కకపోయినా కృష్ణప్ప పార్టీకి ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా హుందాగా మెలిగారన్నారు. ఆయనకు ఏ బాధ్యత ఇవ్వాలనేది రాహుల్‌ గాంధీ నిర్ణయిస్తారని తెలిపారు. రాజకీయం అనేది అవకాశాల ఆట, ఎప్పుడైనా, ఏదైనా జరగవచ్చు. మనం ఎల్లప్పుడూ సానుకూలంగా ఉండాలని అన్నారు.

ఎమ్మెల్యే కృష్ణప్ప, ఆయన కుమారుడు ప్రియాకృష్ణప్పలకు సీఎం తదితరుల పరామర్శలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement