శివాజీనగర: విధానపరిషత్ సభాపతి పదవికి బసవరాజ్ హొరట్టి రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం ఆయన మాట్లాడుతూ నన్ను వెంటనే రాజీనామా చేయమని అడిగారు. అందుకే నేను రాజీనామా చేశాను. ఆగస్టు 14న రాజీనామా చేయాల్సింది. రాజీనామా చేయాలని తాను అప్పటికే నిర్ణయించుకున్నాను. నా పదవీకాలం ముగియకముందే రాజీనామా చేయడం కొంచెం నిరాశ కలిగిస్తోంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒత్తిడి లేదు. రాజీనామా చేయమన్నారు. నిబంధనల ప్రకారం రాజీనామా లేఖను డిప్యూటీ స్పీకర్‌కు సమర్పించాలి. డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉన్నప్పటికీ స్పీకర్ రాజీనామా లేఖను డిప్యూటీ స్పీకర్‌కు సమర్పించాలి. విధాన పరిషత్ కార్యదర్శి దానిని ఆమోదం కోసం గవర్నర్‌కు పంపుతారని వివరించారు. జీవితంలో ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇది అలానే జరిగింది. రాజకీయాల్లో ఇదంతా సహజం. రాజీనామా చేయమన్నప్పుడు చేయక్కర్లేదా? నేను ఈరోజే రాజీనామా చేశాను. ఈ స్థానానికి గౌరవం ఇవ్వటం, ఇవ్వకపోవటం వారికి సంబంధించినది. నేను 18 మంది ముఖ్యమంత్రులను చూశాను. సభలోని అన్ని పార్టీలు దానిని గౌరవించాయి. సభ నిర్వహణ తీరుపై నేను 90 శాతం మేరకు సంతృప్తిగా ఉన్నాను.
బెళగావిలో అర్థరాత్రి వరకు సభ నడిపా
బెళగావిలో అర్థరాత్రి 2 గంటల వరకు నేను సభను నడిపాను అని ఆయన గుర్తు చేసుకున్నారు. ఒకవేళ సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే ఈ పరిస్థితి తలెత్తి ఉండేది కాదా? అని అడగగా ఆయన, నేను దీని గురించి మాట్లాడను. రాజీనామా విషయాన్ని నేను సిద్దరామయ్యకు కూడా తెలియజేశానని అన్నారు. నేను ఈరోజు రాజీనామా చేస్తానని అనుకోలేదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఊహించని పరిణామాలు జరుగుతుంటాయి. అకస్మాత్తుగా వచ్చాను, అకస్మాత్తుగా వెళుతున్నాను అంతే అని అన్నారు. సీ.టీ.రవి వర్సెస్ లక్ష్మీ హెబ్బాళ్కర్ కేసుపై వ్యాఖ్యానిస్తూ, ఇలాంటి సంఘటనలు జరుగకూడదు. నేను వారిద్దరికీ ఫోన్ చేసి మాట్లాడి నా నిర్ణయాన్ని తెలియజేశాను. వారు మళ్లీ తమ తరపున దరఖాస్తు చేశారు. నేను దానిని ఎథిక్స్ కమిటీకి ఇచ్చానన్నారు. హొరట్టితో సమావేశం అనంతరం సీఎం మాట్లాడుతూ మేం హొరట్టితో చర్చించాం. నాకు రాజకీయ వాస్తవాల గురించి తెలుసు. ఆయన తన రాజీనామాను సమర్పించారు. నేను స్వయంగా ఆయనకు విజ్ఞప్తి చేశా. ఆయన ప్రొటెం స్పీకర్‌గా కొనసాగుతారన్నారు.
బసవరాజ్ హొరట్టి


