శివాజీనగర: చిక్కమగళూరు జిల్లా స్థానిక సంస్థల నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ నాయకురాలు గాయత్రి శాంతేగౌడ ఎమ్మెల్సీగా శుక్రవారం అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతో పరిషత్ సభాపతి బసవరాజ్ హొరట్టి ప్రమాణ స్వీకారం చేయించారు. గతంలో ఆమైపె బీజేపీ అభ్యర్థి ఎం.కే.ప్రాణేశ్ కేవలం 6 ఓట్ల తేడాతో గెలిచినట్లు ప్రకటించారు. అయితే ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ గాయత్రి శాంతేగౌడ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు రీకౌంటింగ్ ఆదేశం, అనంతరం సుప్రీంకోర్టులో జరిగిన న్యాయపోరాటం తరువాత హైకోర్టు గాయత్రి శాంతేగౌడను విజేతగా ప్రకటించింది. ఆరేళ్ల పదవీ కాలంలో ఇప్పటికే 4.5 ఏళ్లు గడిచిపోయాయి. మిగిలిన పదవీకాలానికి గాయత్రి ఎమ్మెల్సీగా కొనసాగుతారు. స్పీకర్ కార్యాలయంలో జరిగిన నిరాడంబర ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం డీ.కే.శివకుమార్, పార్టీ ప్రముఖ నాయకులు, ప్రజా ప్రతినిధులు, మద్దతుదారులు హాజరై కొత్త సభ్యురాలికి శుభాకాంక్షలు తెలిపారు.


