సాక్షి,బళ్లారి: సాధారణంగా తమ నాయకుడి జన్మదిన వేడుకకు అభిమానులు కేక్ కట్ చేయడం, అన్నదానం చేయడం, ఆస్పత్రుల్లో పాలు, బ్రెడ్ పంపిణీ చేయడం చూస్తుంటాం. అయితే కర్ణాటకలోని హావేరి జిల్లా హానగల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీనివాస్ 52వ జన్మదినం సందర్భంగా ఆయన అభిమానులు వినూత్న తరహాలో రక్తదాన శిబిరం నిర్వహించి హిందూ, ముస్లిం, క్రైస్తవ మత గురువులకు రక్త తులాభారం వేశారు. అభిమానానికి, మతసామరస్యానికి ప్రతీకగా నిలిచారు. ఈ శిబిరంలో 901 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేయడం విశేషం. రక్తదానంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్టు నిర్వాహకులు తెలిపారు.
ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా
సర్వమత గురువులకు రక్త తులాభారం


