హైదరాబాద్‌లో మహిళ అనుమానాస్పద మృతి | Chilakaluripet Shock: Woman Dies Extra-Marital Affair Suspected, Paramour Detained | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో మహిళ అనుమానాస్పద మృతి

Aug 8 2026 1:32 PM | Updated on Aug 8 2026 1:35 PM

 Chilakaluripet incident

చిలకలూరిపేట: వివాహేతర సంబంధం నేపథ్యంలో మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో శుక్రవారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని వైఎస్సార్‌ కాలనీకి చెందిన నూర్‌ బాష ఆశా (33) కొంతకాలంగా తన 12 ఏళ్ల కుమారుడితో కలసి తాగునీటి చెరువుకు వెళ్లే టిడ్కో గృహ సముదాయంలో నివాసం ఉంటుంది. సుమారు ఐదేళ్ల కిందట కుటుంబ కలహాల నేపథ్యంలో భర్తతో విడిపోయింది. కొంతకాలంగా తన మాజీ భర్త ఊరికి చెందిన పర్చూరు మండలం నూతలపాడు గ్రామానికి చెందిన, సుల్తాన్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది.

 సుల్తాన్‌ కూడా భార్యతో విడిపోయి వేరుగా ఉంటున్నాడు. ఈ క్రమంలో ఐదు రోజుల కిందట కుమారుడిని తెలిసిన వాళ్ల ఇంటిలో వదిలివేసి ప్రియుడు సుల్తాన్‌తో కలసి హైదరాబాద్‌ వెళ్లింది. అక్కడ మెకానిక్‌గా పనికి కుదిరిన సుల్తాన్‌ గురువారం ఉదయం పనుల నిమిత్తం షెడ్డుకు వెళ్లాడు. అతను పనిలో ఉండగా ఇంటి చుట్టుపక్కల వారు ఫోన్‌ చేసి ఆశా ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడి ఉన్నట్లు, తాము కిటికీలో నుంచి చూశామని సమాచారం అందించారు. 

దీంతో ఇంటికి చేరుకున్న సుల్తాన్‌ మృతదేహాన్ని తీసుకొని అంబులెన్స్‌లో ఎక్కించుకొని చిలకలూరిపేటలోని వైఎస్సార్‌ కాలనీ వద్దకు చేరుకున్నాడు. అంబులెన్స్‌కు బాడుగ డబ్బులు తీసుకువస్తానని వెళ్లి ఎంతకు రాకపోవడంతో అనుమానం వచ్చిన అంబులెన్స్‌ డ్రైవర్‌ డయల్‌ 100కు, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో చిలకలూరిపేట పట్టణ పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సుల్తాన్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement