జగనన్న ప్రగతిరథం పిలుస్తోంది

 బెంగళూరులో పోస్టర్లను విడుదల చేస్తున్న 
 వైఎస్సార్‌సీపీ ఐటీ వింగ్‌ సభ్యులు  - Sakshi

బనశంకరి: 2019 సార్వత్రిక ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలుపొంది, మ్యానిఫెస్టో అంటే పవిత్ర గ్రంథమని తలచి, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్న 98 శాతం హమీలను నెరవేర్చడం మనందరం చూశాం. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న జగనన్న ప్రభుత్వాన్ని మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యమని వైఎస్సార్‌సీపీ ఐటీ విభాగం– బెంగళూరు నేతలు తెలిపారు. గత పాలనలో జరగని, ప్రస్తుత పాలనలో జరిగిన రాష్ట్ర ప్రగతిని చాటిచెప్పే లక్ష్యంతో ఈ నెల 18న సాయంత్రం 4 గంటలకు విజయవాడలో జగనన్న ప్రగతి రథం ర్యాలీ జరగనుందని తెలిపారు. ఈ నేపథ్యంలో శనివారం బెంగళూరు హెచ్‌ఎస్‌ఆర్‌ లేఔట్‌ బీడీఏ కాంప్లెక్స్‌ వద్ద ఐటీ వింగ్‌– బెంగళూరు నేతలు, సభ్యులు పోస్టర్‌ను విడుదల చేశారు. విజయవాడకు ప్రగతి రథం కార్యక్రమానికి రావాలనుకునేవారు సాయం కోసం 90351 93106 నంబరులో సంప్రదించాలని తెలిపారు.

వైఎస్సార్‌సీపీ ఐటీ వింగ్‌చే పోస్టర్ల విడుదల

Read latest Karnataka News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top