దైవకుమారుడా.. జయము జయము
బసిలికా ఆవరణలో బాలఏసు మందిరం
గురువారం ఉదయం బెంగళూరులోని సెయింట్ మేరీస్ బసిలికాలో భక్తుల ప్రార్థనలు
బసిలికా చర్చి లోపల విశేష ప్రార్థనలు
బనశంకరి: ఏసు ప్రభువు పరలోకమును విడిచి సకల మానవాళి మేలు కోసం భువిపై వెలసిన పవిత్ర దినమే క్రిస్మస్ అని మతగురువులు పేర్కొన్నారు. గురువారం బెంగళూరుతో పాటు రాష్ట్రమంతటా క్రిస్మస్ పండుగ రోజును క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో ఆచరించారు. బుధవారం రాత్రి నుంచి అన్ని చర్చిలను సుందరంగా అలంకరించి ప్రార్థనలు చేపట్టారు. బెంగళూరులోని శివాజీనగర సెయింట్ మేరీస్ బసిలికా చర్చిలో బుధవారం అర్ధరాత్రి మతగురువుల ఆధ్వర్యంలో విశేష ప్రార్థనలు జరిగాయి. వేలాదిగా క్రైస్తవులు పాల్గొన్నారు. పులకేశినగరలోని హోలి ఘోస్ట్ చర్చి, ఎంజీ.రోడ్డులోని సెయింట్‌మార్క్ కెథెడ్రల్, హడ్సన్ మెమోరియల్ చర్చ్, వివేకనగరలోని ఇన్‌ప్యాంట్ జీసస్ చర్చ్‌లో ఉదయం నుంచి పెద్ద ఎత్తున ప్రార్థనలు జరిగాయి. భక్తులు కొవ్వొత్తులు వెలిగించి బాల ఏసును, మేరి మాతను కొలిచారు. భక్తిపూర్వకంగా గానాలాపనలు జరిగాయి. మైసూరులోని సెయింట్ ఫిలోమినా చర్చ్‌లో ప్రార్థనల్లో వేలాదిగా పాల్గొన్నారు. అందరూ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పుకుని కేకులు పంచుకున్నారు.
బుధవారం అర్ధరాత్రి సాగిన ప్రత్యేక ప్రార్థనలు
రాష్ట్రవ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలు
చర్చిలలో క్రైస్తవుల విశేష ప్రార్థనలు
దైవకుమారుడా.. జయము జయము
దైవకుమారుడా.. జయము జయము
దైవకుమారుడా.. జయము జయము
దైవకుమారుడా.. జయము జయము
దైవకుమారుడా.. జయము జయము


