వాజ్‌పేయి జయంతి
కోలారు: భారత దేశం అత్యంత పటిష్ట దేశమని ప్రపంచానికి చాటిన ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి అని జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఓం శక్తిచలపతి అన్నారు. వాజ్‌పేయి జయంతి సందర్భంగా నగరంలోని డూం లైట్ సర్కిల్ వద్ద గురువారం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. శక్తిచలపతి మాట్లాడుతూ ప్రపంచానికి తెలియకుండా అణ్వస్త్ర పరీక్ష నిర్వహించి భేష్ అనిపించారని తెలిపారు. దేశం సార్వభౌమత్వానికి భంగం కలిగిస్తే తగిన గుణపాఠం చెబుతామని పేర్కొన్నారన్నారు. జేడీఎస్ నాయకుడు సీఎంఆర్.శ్రీనాథ్ మాట్లాడుతూ దివంగత ప్రధాని వాజపేయి అత్యంత దూరదృష్టిని కలిగి ఉండేవారని, ఆయన పాలనా వైఖరిని పాలనలో చూడవచ్చని తెలిపారు. ఈసందర్భంగా మాగేరి నారాయణస్వామి, ఎస్‌బీ.మునివెంకటప్ప, రాకేష్‌గౌడ, నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.


