ఇంటికి నిప్పంటుకొని ఒకరు మృతి
కెలమంగలం: ఇంట్లో కొవ్వొత్తి వెలిగించి మద్యం మత్తులో నిద్రిస్తుండగా అకస్మాత్తుగా ఇంటికి నిప్పంటుకొని ఒకరు మృతి చెందారు. వివరాల మేరకు.. డెంకణీకోట సంతవీధికి చెందిన పెరియస్వామి(55), మిత్రుడు బెట్టముగిళాలం ప్రాంతానికి చెందిన మాదప్ప(60). పెరియస్వామి సంత వీధిలో సిమెంట్ షీట్లు, అట్ట బాక్సులతో ఇల్లు నిర్మించుకున్నారు. బస్తాలు మోసే కూలీలుగా పనిచేస్తున్న వీరు బుధవారం రాత్రి మద్యం తాగారు. ఇంట్లో వెలుతురు కోసం కొవ్వొత్తి వెలిగించారు. మద్యం మత్తులో నిద్రిస్తున్న సమయంలో అకస్మాత్తుగా ఇంటికి నిప్పంటుకొంది. ఈ ఘటనలో మాదప్ప ఘటనా స్థలంలోనే అగ్నికి ఆహుతయ్యాడు. పెరియస్వామి గాయాలతో డెంకణీకోట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. డెంకణీకోట పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.


