ఐసీయూలో నవవధువు
బనశంకరి: అంగరంగ వైభవంగా పెళ్లి, విదేశంలో హనీమూన్.. అంతలోనే నవ వధువు ఆనందం మూణ్నాళ్ల ముచ్చటైంది. రెండునెలలు గడవకముందే ఆత్మహత్యకు ప్రయత్నించింది. బెంగళూరు రామమూర్తినగరలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాలు ఇలా ఉన్నాయి.. అక్టోబరు 29 తేదీన సూరజ్, గానవి (26)కు ప్యాలెస్ మైదానంలో వైభవోపేతంగా వివాహం జరిగింది. గత 10 రోజుల క్రితం శ్రీలంక కు హనీమూన్ కు వెళ్లారు. కానీ మధ్యలోనే తిరిగి వచ్చారు. మీ కుమార్తెను తీసుకెళ్లండి అని భర్త సూరజ్ అత్తమామలకు తెలిపాడు. దీంతో ఆవేదన చెందిన బుధవారం మధ్యాహ్నం భర్త ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. వారు గమనించి ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా ఐసీయూలో చికిత్స పొందుతోంది.
పెళ్లయిన రోజు నుంచి
వేధింపులే
వివాహమైన రోజు నుంచి భర్త సూరజ్, అత్త జయంతి, మరిది సంజయ్ మరింత కట్నం , బంగారం తేవాలని గానవిని పీడిస్తున్నారని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. వారిపై రామమూర్తినగర ఠాణాలో ఫిర్యాదు చేశారు. కట్నం వేధింపులు, ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణతో కేసు నమోదైంది.
భర్త ఇంట వేధింపులతో ఆత్మహత్యాయత్నం
బెంగళూరులో సంఘటన
ఐసీయూలో నవవధువు


