'నేను పక్కా లోకల్‌..' : ఎంపీ బండి సంజయ్‌ | - | Sakshi
Sakshi News home page

'నేను పక్కా లోకల్‌..' : ఎంపీ బండి సంజయ్‌

Feb 4 2024 12:28 AM | Updated on Feb 4 2024 2:59 PM

- - Sakshi

జిల్లా జైలుకు అందించిన అంబులెన్స్‌ వద్ద ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌

కరీంనగర్‌: ‘నేను పక్కా లోకల్‌.. నరేంద్రమోదీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను చెప్పి జనంలోకి వెళ్లి ఓట్లు అడగుతా. దమ్ముంటే మీరు ఎంపీగా చేసినప్పుడు తెచ్చిన నిధులేమిటో.. మీరు చేసిన అభివృద్ధి ఏమిటో.. చెప్పి ఓట్లడిగే దమ్ముందా?’ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ ప్రశ్నించారు.

శనివారం కరీంనగర్‌లోని తీగలగుట్టపల్లి కోదండ రామాలయం సమీపంలో రూ.10లక్షల ఎంపీ నిధులతో కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి భూమి పూజ చేశారు. కరీంనగర్‌ జిల్లాజైలు వద్ద రూ.15 లక్షల ఎంపీ ల్యాడ్స్‌ నిధులతో కొనుగోలు చేసిన అంబులెన్స్‌, వైద్య పరికరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలనే పట్టించుకోని మేధావి వినోద్‌ కుమార్‌ అని, ప్రజలను ఎలా గుర్తుపడతారని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య ఉన్న లోపాయికారి ఒప్పందం ఏమిటో కరీంనగర్‌ ప్రజలకు తెలుసని, తనపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ చేసిన వ్యాఖ్యలను జనం పట్టించుకోవడం లేదని అన్నారు. గ్రామాల్లోకి వెళితే మోదీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమిటో తెలుస్తుందన్నారు. కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ అభివృద్ధికి రూ.12వేల కోట్లకు పైగా నిధులు తీసుకొచ్చానని స్పష్టంచేశారు. వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో బీజేపీ కార్యకర్తలు, జైలు అధికారులు పాల్గొన్నారు.

ఇవి చదవండి: ఐదేళ్లలో ఐదు పైసలు కూడా తేలేదు!

Advertisement
 
Advertisement
Advertisement