కాల్వశ్రీరాంపూర్: కోహెడ సమీపంలోని రాజీవ్ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం తారుపల్లి గ్రామానికి చెందిన జక్కుల సాయికృష్ణ(25) మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. కారు అద్దెకు నడుపుతూ జీవనోపాధి పొందుతున్న యువకుడు .. గ్రామానికి చెందిన క్యాన్సర్ పేషెంట్‌ను హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించి తిరుగు ప్రయాణంలో కోహెడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో తారుపల్లిలో విషాదం అలుముకుంది. మృతుడికి తల్లిదండ్రులు రమాదేవి– మల్లయ్య ఉన్నారు. సాయికృష్ణ అందరితో కలిమిడితో ఉండేవాడని గ్రామస్తులు పేర్కొన్నారు. తల్లిదండ్రులు రోదనలు మిన్నంటాయి.


