కోరుట్లరూరల్: పట్టణంలోని ఎన్‌హెచ్ 63పై శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కోరుట్లకు చెందిన మహమ్మద్ ఖాసీం (37) మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. విలాసాగర్ గ్రామానికి చెందిన దూలపల్లి శంకర్ తన టాటా ఏస్ వాహనంపై మెట్‌పల్లి నుంచి కోరుట్లకు వస్తున్నాడు. మొహమ్మద్ ఖాసీం తన ఎలక్ట్రిక్ స్కూటర్‌పై కోరుట్ల వైపు నుంచి మెట్‌పల్లి వైపు వెళ్తున్నాడు. టాటా ఏస్ వా హనం వేగంగా వచ్చి ఖాసీం బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘ టనలో ఖాసీంకు తీవ్ర గా యాలయ్యాయి. స్థానికులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చె ందాడు. ఖాసీం భార్య అనీ షాబేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


