మాటామాట పెరిగి తలపై రాడ్‌తో దారుణంగా.. | - | Sakshi
Sakshi News home page

మాటామాట పెరిగి తలపై రాడ్‌తో దారుణంగా..

Jan 2 2024 12:30 AM | Updated on Jan 2 2024 11:02 AM

- - Sakshi

కరీంనగర్: మద్యం మత్తులో మాటామాట పెరిగి తలపై రాడ్‌తో బాదడంతో గంగాధర్‌రావు(36)అనే మేషన్‌కూలీ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం రాత్రి గోదావరిఖని పవర్‌హౌసకాలనీలో జరిగింది. గోదావరిఖని వన్‌టౌన్‌ సీఐ ప్రమోద్‌రావు కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన వంచర్ల గంగాధర్‌రావు గోదావరిఖనిలో నివాసం ఉంటున్నాడు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తిరుపతికి చెందిన బోడి అభితేజ పవర్‌హౌస్‌కాలనీలో నివాసం ఉంటూ మేస్త్రీగా పనులు చేయిస్తున్నాడు.

మేషన్‌గా పనిచేస్తున్న గంగాధర్‌రావు బోడి అభితేజ వద్ద డబ్బులు తీసుకుని పనికి రావడం లేదని ఇద్దరి మధ్య గొడవ జరుగుతోంది. ఆదివారం రాత్రి మద్యం మత్తులో ఈవిషయంపై ఇద్దరి మద్య మరోసారి గొడవ జరిగింది. ఆవేశానికి లోనైన బోడి అభితేజ రాడ్‌తో గంగాధర్‌రావు తలపై బాదడంతో గంగాధర్‌రావు అక్కడికక్కడే మృతి చెందాడు. నిందితుడు అభితేజ ఉంటున్న ఇంటి వద్ద ఈఘటన జరిగింది. ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ వివరించారు.

ఇవి చ‌ద‌వండి: విదేశాల నుంచి కూతురు వచ్చాకే అంత్యక్రియలు..

Advertisement
 
Advertisement
Advertisement