జగిత్యాలక్రైం: జగిత్యాలలోని ఇస్లాంపురకు చెందిన మహ్మద్ అబ్దుల్ జావిద్ (27) మాల్టా దేశంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్లు అతని బంధువులు తెలిపారు. జావిద్ ఏడాదిన్నర క్రితం ఉద్యోగ నిమిత్తం మాల్టా వెళ్లాడు. మూడు నెలల క్రితం స్వగ్రామానికి వచ్చి వివాహం చేసుకుని మళ్లీ తిరిగి వెళ్లాడు. ఎప్పటిలాగే కంపెనీ ఉద్యోగం కోసం కారులో వెళ్తుండగా ట్రక్కు ఢీకొంది. ఈ ఘటనలో జావిద్ అక్కడికక్కడే మృతిచెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న అతని బంధువులు, స్నేహితులు భారీగా తరలివచ్చి కన్నీరుమున్నీరవుతున్నారు.
జగిత్యాల యువకుడి మృతి
మూడు నెలల క్రితమే పెళ్లి
ఇస్లాంపురలో విషాదం


